మహావతార్.. మాస్టర్ స్ట్రోక్ దెబ్బ..!
మహావతార్ ఏ ముహూర్తాన ఈ ప్రాజెక్ట్ అనుకున్నారో.. ఎలా తీశారో.. ఎన్నాళ్లు కష్టపడ్డారో కానీ సినిమాకు వచ్చిన రెస్పాన్స్.. చేస్తున్న కలెక్షన్స్ ఇవన్నీ చూస్తే అదుర్స్ అనేయొచ్చు.;
పాన్ ఇండియా సినిమాలతో హంగామా చేస్తున్న సినిమాలు ఒక పక్క అయితే.. కొత్తగా యానిమేటెడ్ అటెంప్ట్ చేసి సెన్సేషనల్ హిట్ కొట్టిన మహవాతార్ అద్భుతాలు మరో పక్క అనేలా ఉంది. మహావతార్ ఏ ముహూర్తాన ఈ ప్రాజెక్ట్ అనుకున్నారో.. ఎలా తీశారో.. ఎన్నాళ్లు కష్టపడ్డారో కానీ సినిమాకు వచ్చిన రెస్పాన్స్.. చేస్తున్న కలెక్షన్స్ ఇవన్నీ చూస్తే అదుర్స్ అనేయొచ్చు. అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేసిన మహావతార్ నరసింహ సినిమాను హోంబలే బ్యానర్ నిర్మించింది.
మహావతార్ వసూళ్లు మైండ్ బ్లాక్..
అసలు ఇలాంటి అటెంప్ట్ జనాల్లోకి వెళ్తుందా.. బడ్జెట్ రికవర్ అవుతుందా అన్న సందేహాలు రావొచ్చు. కానీ అవేవి మైండ్ లో లేకుండా జస్ట్ వాళ్లు అనుకున్నది చేశారు. ఫలితం ఆ నరసింహ స్వామికే వదిలేశారు. ఆయన అనుగ్రహం గట్టిగా ఉన్నట్టు ఉంది. మహావతార్ వసూళ్లు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఏకంగా 100 కోట్లు దాటి వసూళ్ల భీభత్సం సృష్టిస్తుంది.
మహావతార్ నరసింహ సినిమా ఈ రేంజ్ రిజల్ట్ ని మేకర్స్ ఎక్స్ పెక్ట్ చేశారా అంటే అవును డెఫినెట్ గా చేసి ఉండకపోవచ్చు. జస్ట్ సినిమాతో మహావతార్ ఫ్రాంచైజీలు పరిచయం చేయాలని అనుకున్నారు. కానీ సినిమా యానిమేటెడ్ అనే భావన తప్ప మేకింగ్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సినిమా చూస్తున్న ఆడియన్స్ పూనకాలు తెచ్చుకుంటున్నారు అంటే అది సినిమా ఇచ్చిన హై అన్నమాట.
మహావతార్ పరశురామ గ్రాండ్ గా ప్లాన్..
ఇక నెక్స్ట్ మహవాతార్ సినిమాలకు ఈ సినిమా తెచ్చిన క్రేజ్ తో భారీ హైప్ ఉంటుంది. మహావతార్ లో రెండో సినిమా మహావతార్ పరశురామ. ఆ సినిమా కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మహావతార్ సీరీస్ లు ఇంకా చాలా రాబోతున్నాయి. మహావతార్ నరసిం హ ఈ ఇయర్ వచ్చింది. ఆ నెక్స్ట్ మహావతార్ పరశురాం 2027లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. మహావతార్ రఘునందన్ 2029లో వస్తుందట.
మహావతార్ ద్వారకాదిష్ 2031లో.. మహావతార్ గోకులనందన్ 2033లో.. మహావతార్ కల్కి పార్ట్ 1 2035 కి.. మహావతార్ కల్కి పార్ట్ 2 2037 లో తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు హోంబలే మేకర్స్. ఒక్క మహావతార్ నరసిం హ వస్తేనే ఇలాంటి హంగామా ఉంటే. ఇక ఆ సీరీస్ లు అన్నీ కూడా వస్తే మాత్రం ఊహిస్తేనే నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంది. మహావతార్ సీరీస్ లతో హోంబలే బ్యానర్ రేంజ్ మరింత పెరుగుతుంది.
ఓ పక్క ఈ సినిమాలతోనే కాకుండా భారీ ప్రాజెక్ట్ లతో వాళ్లు సినిమాలు చేస్తున్నారు. మహావతార్ సీరీస్ లతో హోంబలే బ్యానర్ పేరు పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ లెవెల్ లో మారుమోగుతుంది.