మహావతార్ నరసింహా.. ఎన్ని సినిమాలను కొట్టిందంటే?

చిన్న సినిమాగా రిలీజైన మహావతార్ నరసింహా భారీ విజయం అందుకొని.. ఊహించని రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తోంది.;

Update: 2025-08-28 06:33 GMT

చిన్న సినిమాగా రిలీజైన మహావతార్ నరసింహా భారీ విజయం అందుకొని.. ఊహించని రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తోంది. జులై 25న విడుదలైన ఈ సినిమా గత నెల రోజులుగా అనేక పెద్ద సినిమాలను తట్టుకొని బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా.. వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.300 కోట్ల మార్క్ అందుకుంది.

మహావతార్ నరసింహా సినిమా విడుదలతో హరిహర వీరమల్లు, కింగ్డమ్, వార్ 2, కూలీ లాంటి బడా స్టార్ల సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయినా వీటిన్నింటి నుంచి గట్టి పోటీ ఎదురైనా.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమానే విజేతగా నిలిచింది. ఎన్నో చిన్న సినిమాలపై సైతం ఇంపాక్ట్ చూపించింది. గత నెల రోజులుగా అనేక సినిమాలు రిలీజ్ అయినప్పటికీ.. ఏ చిత్రం కూడా మహావతార్ నరసింహా కలెక్షన్లను, ఆక్యుపెన్సీని ప్రభావితం చేయలేకపోయాయి.

ఇందులో ఒక కూలీ సినిమాకు డీసెంట్ వసూళ్లు వచ్చినప్పటికీ.. దాని బడ్జెట్ పరంగా పోల్చుకుంటే అది తక్కువనే చెప్పాలి. కానీ ఓ యానిమేటెడ్ సినిమా బడా స్టార్ల సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాలను వెనక్కినెట్టి నాలుగు వారాలు పూర్తి చేసుకొని, ఐదో వారంలోకి ఎంట్రీ అయ్యింది. ఈ సినిమాతో రిలీజైన, తర్వాత రిలీజైన సినిమాలు థియేటర్లలో నుంచి వెళ్లిపోయాయి. కానీ, మహావతార్ నరసింహా మాత్రం ఇంకా థియేటర్లలో అలరిస్తోంది.

సినిమా బడ్జెట్ తో పాటు, ప్రమోషన్స్ తోపాటు కేవలం రూ.25 కోట్లు ఖర్చైన ఈ సినిమా భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తూ.. ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. భారత్ లో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమా గానూ మహావతార్ నరసింహా నిలించింది. ఇటు తెలుగుతోపాటు, అటు హిందీలోనూ సూపర్ రెస్పాన్స్ అందుకొని లాంగ్ రన్ లో వసూళ్లు గర్జన చేస్తుంది.

హిందీలో రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ దాటి సంచలనం సృష్టించింది. తెలుగులోనూ అంచనాలను మించి వసూళ్లతో నిలకడగా రాణిస్తోంది. ఇంకా ఓటీటీ, టెలివిజన్ డీల్స్ పూర్తి కాలేదు. ఈ ధర భారీ స్థాయిలోనే ఉండడం పక్కా. దీంతో థియేట్రికల్, ఓటీటీ డీల్స్ తోపాటు మేకర్స్ కు భారీ లాభాలు తీసుకురావడం పక్కా!

Tags:    

Similar News