వీరమల్లుకి మేలు చేసిన అల్లు అరవింద్..!

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమాకు ఒక మంచి చేశారు.;

Update: 2025-08-04 14:30 GMT

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమాకు ఒక మంచి చేశారు. అదేంటి వీరమల్లుకి అల్లు అరవింద్ కి అసలు సంబంధం లేదు కదా అంటే.. వీరమల్లు సినిమా రిలీజైన నెక్స్ట్ డేనే మహావతార్ నరసింహ రిలీజైంది. హోంబలే బ్యానర్ లో అశ్విన్ కుమార్ డైరెక్షన్ లో యానిమేటెడ్ సినిమాగా వీరమల్లు వచ్చింది. ఈ సినిమా రోజు రోజుకి విపరీతమైన మౌత్ టాక్ తో కలెక్షన్స్ అదరగొడుతుంది.

వీరమల్లు సినిమా ఉంది కాబట్టే..

ఐతే ఈ సినిమాను అసలేమాత్రం ప్రమోట్ చేయకుండానే రిలీజ్ చేశారు. గీతా ఆర్ట్స్ రిలీజ్ చేసిన ఈ సినిమా ఇప్పటికీ స్ట్రాంగ్ గా దూసుకెళ్తుంది. సినిమా 10 రోజులు సక్సెస్ ఫుల్ రన్ తర్వాత అల్లు అరవింద్ బయటకు వచ్చి సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. వీరమల్లు సినిమా ఉంది కాబట్టే ఆ సినిమాకు పోటీ అవుతుందని మహావతార్ నరసింహ కి ప్రమోషన్స్ చేయలేదు అని అర్ధం అవ్వుతుంది.

అలా చేయకపోవడం వల్ల వీరమల్లుకి హెల్ప్ అయ్యింది. ఐతే మహావతార్ సినిమా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే అద్భుతాలు చేస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు అందరు చూసే సినిమా అని చెబుతున్నారు. ఆ మౌత్ టాక్ తోనే మహావతార్ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. హరి హర వీరమల్లు సినిమాతో పాటు వచ్చిన మహవతార్ సినిమాకు బీభత్సమైన ఫుట్ ఫాల్స్ పడుతున్నాయి. బుక్ మై షోలో కూడా ఈ సినిమా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

మహావతార్ సక్సెస్ మీట్ లో..

వీరమల్లు ఉందనే ఉద్దేశంతోనే పవన్ సినిమాకు పోటీ అవుతుందనే అల్లు అరవింద్ సినిమా రిలీజ్ ముందు ప్రమోట్ చేయలేదు. ఐతే వీరమల్లు సినిమా దాదాపు పూర్తైనట్టే. అందుకే ఇప్పుడు వచ్చి మహావతార్ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. మహావతార్ సినిమా ఫస్ట్ వీక్ లో వీరమల్లు మీద ఎఫెక్ట్ చూపిస్తుండగా రెండో వారం అయినా కూడా కింగ్ డం కి గట్టి పోటీ ఇస్తుంది. మహావతార్ నరసింహ ఇచ్చిన ప్రోత్సాహంతో మేకర్స్ నెక్స్ట్ పరశురామ సినిమాను మరింత భారీగా ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. యానిమేటెడ్ సినిమాల్లో సంచలనాలకు శ్రీకారం చుట్టారు హోంబలే బ్యానర్. రాబోతున్న సినిమాలకు ఈ సక్సెస్ మంచి క్రేజ్ తెచ్చినట్టే.

Tags:    

Similar News