మ‌హ‌న‌టి రీ-రిలీజ్ ఛాన్స్ తీసుకోలేదే!

ర‌వీంద్ర భార‌తిలో సంగ‌మం పౌండేషన్ తో క‌లిసి నిర్వ‌హిస్తున్న‌ట్లు సావిత్రి కుమార్తె విజ‌య‌ చాముండేశ్వ‌రి తె లిపారు.;

Update: 2025-11-29 14:30 GMT

రీ-రిలీజ్ ట్రెండ్ కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. స్టార్ హీరోల బ్లాక్ బ‌స్ట‌ర్లు..ఐకానిక్ చిత్రాలు రీ-రిలీజ్ లోనూ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నాయి. వాటికి నెటి జ‌న‌రేష్ యువ‌త నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇటీవ‌లే నాగార్జున క్ల్ట హిట్ `శివ` రీరిలీజ్ ఏ రేంజ్ లో స‌క్సెస్ అయిందో తెలిసిందే. హీరోల పుట్టిన రోజు వేడ‌క‌లు.. ప్ర‌త్యేక‌మైన రోజుల్ని రీ-రిలీజ్ ల‌తో సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు అభిమానులు. `మ‌హాన‌టి` సావిత్రి రీ-రిలీజ్ కు ఇదే ప‌ర్పెక్ట్ టైమ్. సావిత్రి 90వ జ‌యంతి వేడుక‌లు డిసెంబ‌ర్ 1 నుంచి 6 వ‌ర‌కూ సావిత్రి మోహ‌త్స‌వ్ పేరిట జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

అభిమానులు రీ-రిలీజ్ అడుగుతున్నారు:

ర‌వీంద్ర భార‌తిలో సంగ‌మం పౌండేషన్ తో క‌లిసి నిర్వ‌హిస్తున్న‌ట్లు సావిత్రి కుమార్తె విజ‌య‌ చాముండేశ్వ‌రి తె లిపారు. దీనిలో భాగంగా సావిత్ర న‌టించిన సినిమాల ప్ర‌ద‌ర్శన ఉంటుంద‌న్నారు. ఔత్సాహికుల కోసం పాట‌ల పోటీలు కూడా నిర్వ‌హిస్తున్నారు. అలాగే మ‌హాన‌టి చిత్రాన్ని తెర‌కెక్కించిన నాగ్ అశ్విన్, నిర్మాత‌లు ప్రియాంక ద‌త్, స్వ‌ప్నా ద‌త్ ల‌ను , సావిత్రి పుస్త‌క ర‌చ‌యిత సంజ‌య్ కిషోర్ ల‌ను స‌న్మానిస్తున్నారు. కానీ మ‌హాన‌టి చిత్రాన్ని మాత్రం రీ-రిలీజ్ ఛాన్స్ తీసుకోలేదు. జ‌యంతి సంద‌ర్బంగా రీ-రిలీజ్ చేస్తే బాగుండ‌ని సావిత్రి అభిమానులు కోరుతున్నారు.

మ‌హాన‌టిపై కొత్త అప్ డేట్:

అది జ‌ర‌గాలంటే నిర్మాత‌లు స‌హా నాగ్ అశ్విన్ పూనుకుంటేనే సాధ్య‌మ‌వుతుంది. కానీ నిర్మాత‌లు ఆ దిశ‌గా ఆలోచ‌న చేసిన‌ట్లు క‌నిపించ‌లేదు. మ‌రి జ‌యంతి సంద‌ర్భంగా మ‌హాన‌టి గురించి ఏదైనా కొత్త అప్ డేట్ ఇస్తారేమో చూడాలి. అయితే మ‌హాన‌టి రిలీజ్ అయి ఎంతో కాలం అవ్వ‌లేదు. 2018 లోనే చిత్రం రిలీజ్ అయింది. అంటే కేవ‌లం ఏడేళ్లు మాత్ర‌మే పూర్త‌వుతుంది. ఇలాంటి సినిమాల రీ-రిలీజ్ కు క‌నీసం 15-20 ఏళ్ల స‌మ‌య‌మైనా ఉంటే బాగుంటుంది. అలా చేయ‌గ‌ల్గితే నెక్స్ట్ జ‌న‌రేషన్ చూడ‌టానికి అవ‌కాశం ఉంటుంది. అందుకే నిర్మాత‌లు కూడా రీ-రిలీజ్ ఆలోచ‌న చేసిన‌ట్లు క‌నిపించ‌లేదు.

మ‌హాన‌టిలో సావిత్రి పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టి కీర్తి సురేష్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ ఒదిగిపోయింది. ఈ సినిమాతో న‌టిగా ఆమెకు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కింది. రిలీజ్ అనంత‌రం సావిత్రిని గుర్తు చేసింద‌ని ఆమె అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేసారు. నాటి -మేటి అభిమానుల్ని మ‌హాన‌టి క‌థ ఎతంగానో అల‌రిం చింది. 25 కోట్ల బ‌డ్జెట్ లో నిర్మించిన సినిమా 80 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ చిత్రానికి మిక్కీ.జే. మేయ‌ర్ సంగీతం అందించిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News