మ‌నిషి క్రియేటివిటీ ముందు ఏఐ దిగ‌దుడుపేనా?

మ‌హాభార‌తం యొక్క ఏఐ అడాప్ష‌న్.. మ‌హాభార‌త్‌: ఏక్ ధ‌ర్మయుద్ధ్, రీసెంట్ గానే ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కు వ‌చ్చింది.;

Update: 2025-11-03 15:51 GMT

మ‌హాభార‌తం యొక్క ఏఐ అడాప్ష‌న్.. మ‌హాభార‌త్‌: ఏక్ ధ‌ర్మయుద్ధ్, రీసెంట్ గానే ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కు వ‌చ్చింది. ఆల్రెడీ ఈ ట్రైల‌ర్ కు ఆడియ‌న్స్ నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ట్రైల‌ర్ కు మిక్డ్స్ రెస్పాన్స్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ మ‌హాభార‌తాన్ని ఎలా క్రియేట్ చేసిందో చూడ్డానికి ఆడియ‌న్స్ ఎంతో ఆస‌క్తి చూపారు.

నిరాశ‌కు గురిచేసిన ఏక్ ధ‌ర్మ‌యుద్ధ్

కానీ ఆడియ‌న్స్ ఎగ్జైట్‌మెంట్ ఎంతో సేపు నిల‌వ‌లేదు. మ‌హాభార‌త్‌: ఏక్ ధ‌ర్మ‌యుద్ధ్ స్ట్రీమింగ్ లోకి వ‌చ్చి ఫ‌స్ట్ ఎపిసోడ్ ప్రసారం అయ్యాక ఆడియ‌న్స్ దాన్ని చూసి ఎక్క‌డ లేని నిరాశను వ్య‌క్తం చేశారు. అందులోని ఏఐ విజువ‌ల్స్ చాలామందికి ఎంతో ఇబ్బందిక‌రంగా అనిపించ‌డంతో పాటూ క‌థ‌లో ఎక్క‌డా జీవం లేద‌ని, క‌థ మొత్తం నిర్జీవంగా ఉంద‌ని కామెంట్స్ చేశారు.

మీమ్స్ గా మారిన ప‌లు సీన్లు

అందులోని క‌ఠిన త‌ర‌హా పాత్ర‌ల‌, ర‌క‌ర‌కాల ఫేషియ‌ల్ ఎక్స్‌ప్రెష‌న్స్, అన్ రియ‌లిస్ట్ బ్యాక్ గ్రౌండ్స్ ఆడియ‌న్స్ ను చాలా తీవ్రంగా డిజ‌ప్పాయింట్ చేశాయి. పోనీ విజువ‌ల్స్, సౌండ్ ఏమైనా క్వాలిటీగా ఉందా అంటే అదీ లేదు. దీంతో ఆడియ‌న్స్ కు మ‌హాభార‌త్‌: ఏక్ ధ‌ర్మ‌యుద్ధ్ లోని కొన్ని సీన్స్, షాట్స్ మీమ్స్ గా మారాయి. ఒక్కొక్క‌రు ఒక్కో సీన్ ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు.

దీన్ని చూశాక గ‌తంలో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎంతో క‌ష్ట‌ప‌డి చేసిన మ‌హాభార‌త వెర్ష‌న్ ను గుర్తు చేసుకుని అదెంతో మెరుగ్గా ఉంద‌ని, అందులోని క్యారెక్ట‌ర్లు, పెర్ఫార్మెన్సులు దాన్ని ఆడియ‌న్స్ ముందుకు తీసుకురావ‌డానికి ఎంతో మంది ప‌డిన క‌ష్టాన్ని మెచ్చుకుంటూ ఏక్ ధ‌ర్మ‌యుద్ధ్ లో ఎలాంటి ఎమోష‌న్ లేద‌ని కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఎంత టెక్నాల‌జీ డెవ‌ల‌ప్ అయినా ఏదీ మ‌నిషి యొక్క క్రియేటివిటీని మించ‌ద‌ని, దానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని ప‌లువురు సోష‌ల్ మీడియాలో త‌మ అభిప్రాయాన్ని వెల్లిబుచ్చుతున్నారు.

Tags:    

Similar News