ఆయన నిరాడంబర జీవితానికి వాళ్లే స్పూర్తి!
మాధవన్ సెకెండ్ ఇన్నింగ్స్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. హీరో ఇమేజ్ ని పక్కన బెట్టి తెరపై కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు.;
మాధవన్ సెకెండ్ ఇన్నింగ్స్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. హీరో ఇమేజ్ ని పక్కన బెట్టి తెరపై కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. ఓ స్టార్ హీరో నటిస్తోన్న పాన్ ఇండియా సినిమాలో డాడ్ పాత్ర కూడా పోషిస్తున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఇదే నిజమైతే? ఓ రకంగా మ్యాడీ అభిమానుల ఫీలయ్యే అవకాశం లేక పోలేదు. అప్పుడే హీరోలకు డాడీ రోల్ ఏంటనే విమర్శ తప్పదు.కానీ నటుడిగా ఎలాంటి హద్దులు లేకుండా పని చేయడం అన్నది మ్యాడీ ఫాలసీ.
ఆ సంగతి పక్కన బెడితే? మాధవన్ ఆఫ్ ది స్క్రీన్ ఎంతో నిరాడంబర జీవితాన్ని గడుపుతారని తెలుస్తోంది. అందుకు మ్యా డీలో స్పూర్తినింపింది సూపర్ స్టార్ రజనీకాంత్, తల అజిత్ అని తెలిసింది. ఈ విషయాన్ని మ్యాడీ తొలి సారి రివీల్ చేసాడు. ఇమేజ్ , ఫేం అన్నది కేవలం తెరపై మాత్రమేనని..తెర వెనుక చాలా సింపుల్ గా ఉంటానన్నారు. జుట్టు నెరిసినా రంగు వేయడం అన్నది కేవలం నటుడిగా మాత్రమే నని.. సినిమాలు లేకపోతే తెల్ల రంగు జుట్టు తోనే బయట తిరుగుతానన్నారు.
అలా సహజంగా ఉండటమే తనకు ఇష్టమన్నారు. తానెప్పుడు ఎవర్నీ పోటీగా భావించనని..తనకు తానే సవాల్ గా ప్రయాణం చేస్తానన్నారు. ఈ విషయంలో రజనీకాంత్, అజిత్ లాంటి స్టార్లు తనకు స్పూర్తి అన్నారు. తెరపై పాత్ర కోసం రజనీకాంత్ ఎలా కనిపించినా? తెర వెనుక మాత్రం చాలా సాధారణంగా ఉంటారని గుర్తు చేసారు. తెరపై ఎంత అద్భుతం చేసినా ఆఫ్ ది స్క్రీన్ ఆయన లోసింప్లిసిటీ తనకెంతో నచ్చుతుందన్నారు. అలాగే తన స్నేహితుడు అజిత్ కూడా అలాగే ఉంటారన్నారు.
వాళ్లిద్దర్నీ చూసే ఇమేజ్ గురించి ఎంత మాత్రం ఆందోళన చెందాల్సిన లేదన్న విషయాన్ని గ్రహించి నట్లు తెలిపారు. వీలైనంత వరకూ సౌకర్యవంతంగా ఉండటమే తనకు ఇష్టమన్నారు. అప్పుడప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్ లాంటి నటులు కూడా కొన్ని రకాల ఆడంబరాలు దూరంగా ఉంటారు. ఎలాంటి మ్యాకప్ లేకుండానే బయటకు వస్తుంటారు.