• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బచ్చల మల్లి.. మాస్ లో...

బచ్చల మల్లి.. మాస్ లో క్యూట్ లవ్

| ఇప్పటికే ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాటలో నరేష్, అమృత మధ్యలో కెమిస్ట్రీ చాలా బ్యూటీఫుల్ గా ఉంది.

By - Tupaki Desk
Update: 2024-07-16 13:28 GMT

అల్లరి నరేష్ గత కొంత కాలంగా డిఫరెంట్ కథలను టచ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎక్కువగా కామెడీ జానర్ ను టచ్ చేసే ఈ హీరో నేటితరం హీరోలతో పోటీ పడుతూ ప్రయోగాలు కూడా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు అతను చేస్తున్న "బచ్చల మల్లి" చిత్రం టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. అమృత అయ్యర్ నరేష్ కు జోడిగా నటిస్తోంది.

ఇక 'సామజవరగమన, ఊరు పేరు భైరవకోన' వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. 'సోలో బ్రతుకే సో బెటర్' ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఒక డిఫరెంట్ కథను చూపించనున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. ఇక ప్రమోషన్ డోస్ కూడా పెంచారు.

ఇటీవల హీరో నరేష్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ మరియు పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా "మా ఊరి జాతరలో" అనే ఫస్ట్ సింగల్ విడుదల చేశారు. ఈ సాంగ్‌కు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా, గౌరీ హరి, సింధు విశాల్ ఆలపించారు. శ్రీమణి లిరిక్స్ అందించారు.

ఇప్పటికే ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాటలో నరేష్, అమృత మధ్యలో కెమిస్ట్రీ చాలా బ్యూటీఫుల్ గా ఉంది. వారి ప్రేమ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అని చెప్పవచ్చు. ఈ మూవీలో నరేష్ ఇంతకు ముందు ఎన్నడూ చేయని పవర్ఫుల్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. డైరెక్టర్ సుబ్బు ఈ సినిమాతో నరేష్‌ని పూర్తిగా కొత్త తరహాలో చూపించనున్నారు.

రీసెంట్‌గా విడుదల చేసిన గ్లింప్స్ ద్వారా ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక "బచ్చల మల్లి" చిత్రంలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలోని పాత్రలతో, కథానాయకుల నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి, అల్లరి నరేష్ మాస్ క్యారెక్టర్‌లో నటిస్తుండడంతో, ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచింది. “బచ్చల మల్లి” సినిమా మేకర్స్ అందించిన ప్రోమోషనల్ కంటెంట్, ప్రత్యేకంగా ఫస్ట్ సింగల్ "మా ఊరి జాతరలో" ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో నరేష్ పాత్ర కొత్తగా ఉండడంతో, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Full View
Tags:    
  • Allarinaresh 
  • Amrithaiyer 
  • Bachhalamalli 
  • Vishalchandrashekar 
  • Samajavaragamana 
  • OruperuBhairavakona 

Similar News

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS