టాలీవుడ్ స్టార్ తో లైకా ప్రొడ‌క్ష‌న్స్!

'క‌త్తి' చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన లైకా ప్రొడ‌క్ష‌న్స్ అనతి కాలంలో బ‌డా నిర్మాణ సంస్థ‌ల స‌ర‌స‌న స్థానం సంపాదించింది.;

Update: 2025-10-24 02:30 GMT

కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేని నిర్మాణ సంస్థ‌. `క‌త్తి` చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన లైకా ప్రొడ‌క్ష‌న్స్ అనతి కాలంలో బ‌డా నిర్మాణ సంస్థ‌ల స‌ర‌స‌న స్థానం సంపాదించింది. వ‌రుస‌గా స్టార్ హీరోల‌తో సినిమాలు నిర్మించి విజ‌యాలు అందుకుని కోలీవుడ్ లో అగ్ర‌గామి సంస్థ‌గా వెలుగులోకి వ‌చ్చింది. టాలీవుడ్ లో సైతం స‌ద‌రు నిర్మాణ సంస్థ ఆరంభంలోనే ఎంట్రీ ఇచ్చింది `క‌త్తి` చిత్రాన్ని తెలుగులో `ఖైదీ నెంబ‌ర్ 150`వ చిత్రంగా రీమేక్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన ఆ సినిమా తెలుగులోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే.

చిరంజీవి త‌ర్వాత చ‌ర‌ణ్ తో:

లైకా ప్రొడ‌క్ష‌న్స్ లో ఇది మూడ‌వ చిత్రం. అలా తెలుగులోనూ లైకాకు గ్రాండ్ లాంచింగ్ ద‌క్కింది. అయితే ఆ త‌ర్వాత మ‌రో తెలుగు సినిమా చేయ‌లేదు. పూర్తిగా కోలీవుడ్ కే ప‌రిమిత‌మైంది. అక్క‌డ స్టార్ హీరోలు టార్గెట్ గానే ప‌నిచేస్తూ వ‌చ్చింది. కొన్ని సినిమాల ప్లాప్ తో నిర్మాణ సంస్థ ఒకానొక ద‌శ‌లో న‌ష్టాల బారిన ప‌డింది. అయినా లైకా బ్రాండ్ ఇమేజ్ ని ఎక్క‌డా కోల్పోకుండా సినిమాలు చేస్తూ వ‌చ్చింది. తాజాగా ఈ సంస్థ తెలుగులో సెకెండ్ వెంచ‌ర్ కి రెడీ అవుతుందని స‌మాచారం. ఈసారి మెగాస్టార్ త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ ని తెర‌పైకి తెస్తుంది. ఇటీవ‌లే లైకా సంస్థ రామ్ చ‌ర‌ణ్ తో సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు కోలీవుడ్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి.

క్యూలో బ‌డా నిర్మాణ సంస్థ‌లు:

లైకాలో ఓ సినిమా చేయాల్సిందిగా సద‌రు సంస్థ చ‌రణ్ ని కోరిందిట‌. అందుకు చ‌ర‌ణ్ కూడా పాజిటివ్ గా స్పందిం చిన‌ట్లు స‌మాచారం. మ‌రి ఆ ప్రాజెక్ట్ ఇప్పుడే సాధ్య‌మ‌వుతుందా? లేదా? అన్న‌ది తెలియాలి. ఎందుకంటే చ‌ర‌ణ్ కు టాలీవుడ్ నిర్మాణ సంస్థ‌ల‌తో అగ్రిమెంట్లు ఉన్నాయి. ఇప్ప‌టికే ప‌లు నిర్మాణ సంస్థ‌ల నుంచి అడ్వాన్సులు అందుకున్నారు. `ఆర్ ఆర్ ఆర్` త‌ర్వాత చాలా మంది నిర్మాత‌లు చ‌ర‌ణ్ కోసం క్యూలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ కొంద‌ర్ని సెల‌క్ట్ చేసుకుని వారి వ‌ద్ద అడ్వాన్సులు అందుకున్నారు.

అడ్వాన్సులు లాక్ అయ్యాయా?

ప‌వ‌న్ కళ్యాణ్ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తోన్న స‌మ‌యంలో ఈ స‌న్నివేశం చోటు చేసుకుంది. దీంతో బాబాయ్ కు త‌న వంతు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని కొన్నినిర్ణ‌యాల‌తో ముందుకు సాగిన‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. అయితే ప‌వ‌న్ కూట‌మిగా బ‌రిలోకి దిగ‌డంతో చ‌ర‌ణ్ అవ‌స‌రం ప‌డ‌లేదు. కానీ చ‌ర‌ణ్ తీసుకున్న అడ్వాన్సులు లాక్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో ఆ క‌మిట్ మెంట్ల‌ను పూర్తి చేయాల్సిన బాధ్య‌త చ‌ర‌ణ్ పై ఉంది. మ‌రి ఇలాంటి పరిస్థితుల్లో లైకా తో ఎలా ప్లాన్ చేస్తున్నారు? అన్న‌ది తెలియాలి. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ `పెద్ది`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `పెద్ది`ని వృద్ది సినిమాస్-ఐవీ ఎంట‌ర్టైట‌న్ మెంట్స్ నిర్మిస్తున్నాయి. ఈ సినిమా త‌ర్వాత సుకుమార్ తో సినిమా పూర్తి చేయాలి. ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News