ప్రేమ, పెళ్లికి వయసుతో పనేముంది
ప్రేమకు వయసుతో సంబంధం లేదంటున్నారు సెలబ్రిటీలు. ఈ మధ్య పెళ్లి చేసుకుంటున్న సెలబ్రిటీలు తమ కంటే బాగా పెద్ద వారిని చేసుకోవడం లేదంటే మరీ చిన్న వారితో లైఫ్ ను షేర్ చేసుకోవడంతో వారి పెళ్లిళ్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.;
ప్రేమకు వయసుతో సంబంధం లేదంటున్నారు సెలబ్రిటీలు. ఈ మధ్య పెళ్లి చేసుకుంటున్న సెలబ్రిటీలు తమ కంటే బాగా పెద్ద వారిని చేసుకోవడం లేదంటే మరీ చిన్న వారితో లైఫ్ ను షేర్ చేసుకోవడంతో వారి పెళ్లిళ్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. రీసెంట్ గా గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ తన కంటే పెద్ద అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకోవడంతో ఈ విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ భామ మలైకా అరోరా ఖాన్ ఐదు పదుల వయసులో డేటింగ్ చేయడం, మళ్లీ పెళ్లి గురించి మాట్లాడటంతో పాటూ ప్రముఖ నటుడు కబీర్ బేడీ వయసులో తన కూతురి కంటే చిన్నమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం చర్చల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అసలు ప్రేమకు వయసు ముఖ్యమా లేదా ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ముఖ్యమా అనే దిశగా సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి.
కూతురి కంటే చిన్నమ్మాయితో పెళ్లి
కబీర్ బేడీ నాలుగు పెళ్లిళ్లు చేసుకుని విమర్శలు ఎదుర్కోగా, తన 70వ పుట్టిన రోజు నాడు తనకంటే సుమారు 30 ఏళ్ల చిన్నదైన పర్వీన్ దుసాంజ్ ను పెళ్లి చేసుకుని సొంత ఫ్యామిలీ నుంచి కూడా మాట పడ్డారు. అయితే ఈ విషయంలో ఆయన రెస్పాండ్ అయి మాట్లాడారు కూడా. తాను, పర్వీన్ పదేళ్ల పాటూ ప్రేమించుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని, పర్వీన్ తన లైఫ్ లోకి రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కూడా కబీర్ బేడీ చెప్పారు.
టాలీవుడ్ లో కూడా ఇలా ఏజ్ గ్యాప్ ను, వయసును పట్టించుకోకుండా పలువురు పెళ్లి చేసుకున్నారు. ఇవన్నీ చూసిన పలువురు ప్రేమ పుట్టడానికి ఏజ్ లిమిట్ ఏమీ లేదని అంటున్నారు. సైక్రియాటిస్టులు కూడా ఏజ్ గ్యాప్ అనేది అంతర్గతంగా సమస్యలను తీసుకురాదని, ఏ జంటకైనా కావాల్సింది మెంటల్, ఎమోషనల్ ఫ్రీడమేనని, అవి లేనప్పుడు మాత్రమే సమస్యలు వస్తాయని వాళ్లు చెప్తున్నారు.