లార్డ్ మార్కో.. రక్తపాతం చేసేది ఎవరు..?

మలయాళ సినిమాల్లో ఎక్కువగా సహజత్వానికి దగ్గరగా ఉంటూ సెన్సిబుల్ సినిమాలు వస్తుంటాయి.;

Update: 2025-09-18 05:56 GMT

మలయాళ సినిమాల్లో ఎక్కువగా సహజత్వానికి దగ్గరగా ఉంటూ సెన్సిబుల్ సినిమాలు వస్తుంటాయి. ఎమోషన్స్ తో ఆడుకోవడం వాళ్లకి వచ్చినట్టుగా ఎవరికీ రాదేమో అనేలా సినిమాలు చేస్తారు. ఐతే అప్పుడప్పుడు అక్కడ కమర్షియల్ సినిమాలు కూడా క్రేజీగా మారుతుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి మార్కో. మలయాళ సినిమాల్లో రక్తపాతాన్ని ఈ రేంజ్ లో పారించిన సినిమా మరొకటి లేదు. ఆ సినిమా మలయాళంలోనే కాదు మిగతా భాషల్లో రిలీజై అక్కడ సక్సెస్ అందుకుంది.

మార్కోకి సీక్వెల్..

ముఖ్యంగా హిందీ ఆడియన్స్ అయితే మార్కో చూసి పిచ్చెక్కిపోయారు. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మార్కో సినిమాను హనీఫ్ అదేని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా చూసిన తెలుగు నిర్మాత దిల్ రాజు హనీఫ్ కి టాలీవుడ్ ఛాన్స్ ఇచ్చాడన్న వార్తలు వచ్చాయి. ఇదిలాఉంటే ఉన్ని ముకుందన్ మార్కోకి సీక్వెల్ వస్తుంది. అది కూడా ఉన్ని లేకుండా ఈ సీక్వెల్ ఉంటుందని టాక్.

మేకర్స్ మార్కో సీక్వెల్ టైటిల్ ని లార్డ్ మార్కో అని రిజిస్టర్ చేయించారట. ఐతే మార్కో సీక్వెల్ లో ఉన్ని ముకుంద ఉండే ఛాన్స్ లేదని తెలుస్తుంది. కానీ ఉన్ని ప్లేస్ లో ఆ రేంజ్ ఊచకోత సృష్టించేది ఎవరా అన్న డిస్కషన్స్ మొదలయ్యాయి. మలయాళంలో మాస్ ఇమేజ్ ఉన్న హీరోల్లో ఒకరిని లార్డ్ మార్కోగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. హనీఫ్ అదేనినే ఈ సీక్వెల్ ని డైరెక్ట్ చేస్తారా లేదా అన్నది కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

మలయాళం నుంచి యాక్షన్ సినిమాగా..

ఉన్ని ముకుందన్ మాత్రం లార్డ్ మార్కోలో భాగం అయ్యే ఛాన్స్ లేదట. మార్కో తెచ్చిన క్రేజ్ తో ఉన్ని ముకుందన్ ఏకంగా ప్రైం మినిస్టర్ నరేంద్ర మోడీ బయోపిక్ లోనే ఛాన్స్ కొట్టేశాడు. ఆ సినిమా కచ్చితంగా ఉన్ని ముకుందన్ కెరీర్ కి మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. ఉన్ని ముకుందన్ మాత్రం ఈసారి నెక్స్ట్ చేసే సినిమాలు తన రేంజ్ మరింత పెంచే విధంగా ప్లాన్ చేస్తున్నాడట. మోడీ బయోపిక్ తో పాటు మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి.

లార్డ్ మార్కో ఎలా ఉంటుంది.. ఏ రేంజ్ లో రక్తపాతం సృష్టిస్తుంది అన్నది చూడాలి. ఉన్ని ముకుందన్ ఐతే ఆ సీక్వెల్ లో నటించడు కానీ మేకర్స్ అడిగితే అతని క్యామియో ఏదైన ఉండే ఛాన్స్ ఉండొచ్చు. ఏది ఏమైనా మలయాళం నుంచి యాక్షన్ సినిమాగా వచ్చిన మార్కోకి సీక్వెల్ రావడం అనేది ఆ సినిమా ఫ్యాన్స్ కి సూపర్ జోష్ ఇస్తుంది. ఐతే ఉన్ని ముకుందన్ అందులో ఉండడన్న న్యూస్ కాస్త ఇబ్బంది పెట్టినా కచ్చితంగా ఫ్యాన్స్ కి ఫీస్ట్ పక్కా అనేస్తున్నారు.

Tags:    

Similar News