ప్ర‌భుత్వ అవార్డులు: కోలీవుడ్ బెస్ట్ డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా?

లోకేష్ కనగరాజ్ .. ఈ ఐదారేళ్ల కాలంలో సౌతిండియాలో ఎక్కువ‌గా వినిపిస్తున్న ద‌ర్శ‌కుడి పేరు.;

Update: 2026-01-30 10:05 GMT

లోకేష్ కనగరాజ్ .. ఈ ఐదారేళ్ల కాలంలో సౌతిండియాలో ఎక్కువ‌గా వినిపిస్తున్న ద‌ర్శ‌కుడి పేరు. వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్లు తెర‌కెక్కిస్తూ సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న లోకేష్ కోసం ఇప్పుడు బాలీవుడ్ లో ఖాన్‌ల త్ర‌యం స‌హా ప‌లువురు అగ్ర హీరోలు క్యూ క‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిభ‌కు ఎల్ల‌లు లేవు! అని నిరూపించిన గ్రేట్ త‌మిళ‌ తంబీ అత‌డు. అయితే అత‌డిని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నియ‌మించిన అవార్డుల జూరీ ప్ర‌త్యేకంగా గుర్తు పెట్టుకుని స‌త్క‌రిస్తోంది. తాజాగా 2016 నుంచి 2022 వ‌ర‌కూ వ‌రుస‌గా ఏడేళ్లకు గాను, రాష్ట్ర ప్ర‌భుత్వ పుర‌స్కారాల‌ను త‌మిళనాడు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించడం ఒక సంచ‌ల‌నం. తాజా అధికారిక జాబితా ప్రకారం..లోకేష్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కించిన మానగరం(ఖైదీ-తెలుగు), విక్రమ్ చిత్రాలకు గాను ఉత్తమ దర్శకుడిగా రెండు అవార్డులను లోకేష్ ద‌క్కించుకున్నారు.

అవార్డుల పూర్తి వివ‌రాల్లోకి వెళితే... 2019 సంవ‌త్స‌రానికి గాను ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా లోకేష్ క‌న‌గ‌రాజ్ త‌న మొద‌టి చిత్రానికి అవార్డ్ అందుకున్నాడు. కార్తీ హీరోగా `మానగరం` పేరుతో తెర‌కెక్కించిన ఈ సినిమా తెలుగులో ఖైదీ పేరుతో అనువాద‌మై విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం రెండు రాష్ట్రాల్లోను అద్భుతంగా ఆడింది. ఇప్పుడు ఏకంగా త‌మిళ‌నాడు రాష్ట్ర ప్ర‌భుత్వ పుర‌స్కారం ద‌క్కింది. ఒక డెబ్యూ డైరెక్టర్‌కు ఇది చాలా అరుదైన గౌరవం. ఖైదీ విడుద‌లైన‌ త‌ర్వాత నాలుగేళ్ల‌కు, అంటే 2022 సంవ‌త్స‌రంలో వ‌చ్చిన `విక్ర‌మ్` చిత్రానికి గాను మ‌రోసారి ఉత్త‌మ ద‌ర్శ‌కుడి అవార్డును సొంతం చేసుకున్నారు. కమల్ హాసన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన విక్ర‌మ్ ఆ ఏడాది ఇండియా బెస్ట్ హిట్ చిత్రాల‌లో ఒక‌టి. క‌మ‌ల్ హాస‌న్ విశ్వ‌న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న‌కు గాను ఉత్త‌మ న‌టుడిగా త‌మిళ ప్ర‌భుత్వ పుర‌స్కారాన్ని ద‌క్కించుకున్నారు.

2019 సంవత్సరానికి గాను ఖైదీ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచినందుకు హీరో కార్తీకి `ఉత్తమ నటుడు` పుర‌స్కారం ద‌క్కింది. కానీ ఆ ఏడాది ఉత్తమ దర్శకుడిగా మాత్రం ఆర్. పార్తీబన్ (ఒత్త సెరుప్పు సైజ్ 7` చిత్రానికి) అవార్డు గెలుచుకున్నారు.

లోకేష్ కనగరాజ్ కేవలం ఐదు సినిమాలతోనే రెండు సార్లు రాష్ట్ర ప్రభుత్వ అవార్డును అందుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం. ఒక చిన్న బడ్జెట్ సినిమా తో కెరీర్ మొదలుపెట్టి, భారీ యాక్షన్ సినిమా (విక్రమ్) వరకు అన్నిటికీ అవార్డులు అందుకోవడం విశేషం. అంతేకాదు.. క‌న‌గ‌రాజ్ దర్శకత్వంలో నటించిన హీరోలు విజయ్ సేతుపతి, కార్తీ, కమల్ హాసన్ కూడా ఏదో ఒక విభాగంలో గుర్తింపు ద‌క్క‌డం గ‌మ‌నించ‌ద‌గిన‌ది.

ఈ ఏడేళ్ల అవార్డుల గ్యాప్ సంగ‌తి అటుంచితే, ఈ కొద్ది గ్యాప్‌లోనే లోకేష్ క‌న‌గ‌రాజ్ పేరు త‌మిళ‌నాడు స‌హా దేశ‌వ్యాప్తంగా మార్మోగింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్‌.సి.యు)కు వచ్చిన క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. భాత‌దేశంలోని ఫైనెస్ట్ ఫ్రాంఛైజీగా దీనికి గుర్తింపు ద‌క్కింది. ఒక సినిమాలోని పాత్ర‌ను త‌దుప‌రి సినిమాకు ముడిపెడుతూ లోకేష్ త‌న ఎల్.సి.యుని విస్త‌రిస్తున్నారు.

Tags:    

Similar News