కూలీ ఎఫెక్ట్.. లోకేష్ ప్లాన్ ఛేంజ్..?

కూలీ తర్వాత లోకేష్ కనగరాజ్ తన నెక్స్ట్ సినిమాను కార్తితో ఖైదీ 2నే చేస్తాడని అందరు అనుకున్నారు.;

Update: 2025-08-19 08:21 GMT

కూలీ తర్వాత లోకేష్ కనగరాజ్ తన నెక్స్ట్ సినిమాను కార్తితో ఖైదీ 2నే చేస్తాడని అందరు అనుకున్నారు. దాదాపు లోకేష్ కూడా కూలీ సినిమా ప్రమోషన్స్ లో నెక్స్ట్ ఖైదీ 2నే అంటూ చెప్పుకొచ్చాడు. ఖైదీ 2 స్క్రిప్ట్ 34 పేజీలు అద్భుతంగా వచ్చిందని చెప్పాడు. లోకేష్ కనగరాజ్ మీద ఆడియన్స్ పై గురి ఏర్పడిన సినిమా ఖైది. కార్తి, లోకేష్ ఈ కాంబో పై ఎలాంటి హైప్ లేకుండానే వచ్చింది ఖైది. ఆ సినిమా ఇచ్చిన క్రేజ్ తో ఏకంగా ఎల్.సి.యు నే మొదలు పెట్టాడు లోకేష్.

కూలీ తర్వాత ఇమిడియట్ గా..

ఇక విక్రం తో మనోడి రేంజ్ మారిపోయింది. అసలు కూలీ కూడా ఎల్.సి.యు తరహాలోనే తీస్తున్నాడని తెగ హడావిడి చేశారు కానీ లోకేష్ ఎందుకో దీన్ని స్టాండలోన్ సినిమాగా ముగించాడు. ఐతే కూలీ తర్వాత ఇమిడియట్ గా కార్తి సినిమానే మొదలు పెట్టాలని అనుకున్న లోకేష్ ఇప్పుడు తన డెసిషన్ మార్చుకున్నాడని తెలుస్తుంది. కూలీ సినిమా చూసిన చాలామంది లోకేష్ వర్క్ కి సంతృప్తి కాలేదు.

అందుకే తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని మళ్లీ మరో మల్టీస్టారర్ తోనే రావాలని చూస్తున్నాడట. ప్రస్తుతం దానికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. ఈసారి లోకేష్ కనకరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు లోకనాయకుడు కమల్ హాసన్ ఇద్దరితో కలిసి ఒక క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడట. లోకేష్ కాంబోలో రజనీ, కమల్ మల్టీస్టారర్ అంటే ఇక అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఖైదీ 2 పక్కన పెట్టి మళ్లీ రజనీ, కమల్ హాసన్ తో..

విక్రం తో కమల్ కి సెన్సేషనల్ హిట్ ఇచ్చాడు లోకేష్. ఐతే రజనీతో కూలీ అన్ సాటిస్ఫైడ్ అనే చెప్పొచ్చు. కలెక్షన్స్ ఎలా ఉన్నా రజనీ, లోకేష్ కాంబో రేంజ్ సినిమా కాదని అంటున్నారు. అందుకే లోకేష్ ఖైదీని పక్కన పెట్టి మళ్లీ రజనీ, కమల్ హాసన్ తో పనిచేయాలని చూస్తున్నాడట. ఐతే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ బయటకు రావాల్సి ఉంది.

లోకేష్ నిజంగానే ప్లాన్ మార్చాడా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది. లోకేష్ కనగరాజ్ ఖైదీ 2 కూడా భారీ హైప్ తో వస్తుంది. కార్తిలోనే ఊర మాస్ ని ఎక్స్ పోజ్ చేసిన సినిమా ఖైది. ఐతే ఆఫ్టర్ ఇయర్స్ ఖైదీ 2 వస్తుంది కాబట్టి ఆ మూవీపై కూడా భారీ క్రేజ్ ఉంది. అదీగాక ఎల్.సి.యు లో వస్తున్న ఖైదీ 2లో ఎవరెవరు ఉంటారన్న ఆసక్తి కూడా ఆడియన్స్ లో ఉంది. సో ఏ సినిమాతో వచ్చినా లోకేష్ ఈసారి మాత్రం డబుల్ ధమాకా ఇస్తాడని అంటున్నారు.

Tags:    

Similar News