రక్తపాతం చిందిస్తున్న ‘డీసీ’ ట్రైలర్.. హీరోగా లోకేశ్ కనగరాజ్ సంచలనం!

ఇక తాజాగా రిలీజైన ట్రైలర్ ప్రారంభంలోనే కారులో ఒక మహిళ భయంతో కేకలు వేస్తున్న సన్నివేశం కనిపిస్తుంది.

Update: 2026-05-15 18:33 GMT

స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా నటిస్తున్న డీసీ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో క్రైమ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు హీరోయిన్ వామికా గబ్బితో ఉన్న ఎమోషనల్ లవ్ డ్రామా కూడా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

రాకీ, సాణికాయిదం, కెప్టెన్ మిల్లర్ వంటి సినిమాల‌ను తెరకెక్కించిన అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తోంది. ఇందులో లోకేశ్ కనగరాజ్ దేవదాస్ అనే పాత్రలో నటిస్తుండగా, వామికా గబ్బి చంద్ర పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా, తాజాగా వచ్చిన ట్రైలర్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మానగరం సినిమాతో డైరెక్ట‌ర్ గా పరిచయమైన లోకేశ్ కనగరాజ్, ఆ తర్వాత ఖైదీ సినిమాతో మరో స్థాయికి చేరుకున్నారు. అనంతరం రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించారు. చివరిగా ఆయన తెరకెక్కించిన కూలీ సినిమా మంచి వసూళ్లు సాధించింది. ప్రస్తుతం డైరెక్ట‌ర్ గా ఉన్న లోకేశ్ కనగరాజ్, డీసీ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో సంజనా, వామికా గబ్బి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వేలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియోలో సంజనా సిగరెట్ తాగుతూ కనిపించగా, ఆ గదిలోకి లోకేశ్ ప్రవేశించే సన్నివేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇక తాజాగా రిలీజైన ట్రైలర్ ప్రారంభంలోనే కారులో ఒక మహిళ భయంతో కేకలు వేస్తున్న సన్నివేశం కనిపిస్తుంది. ఆ తర్వాత తుపాకీ కాల్పులు, రక్తపాతం, హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో ట్రైలర్ మొత్తం ఉత్కంఠభరితంగా సాగుతుంది. డబ్బు కోసం తమ కుమార్తెను తప్పుదారి పట్టించే తల్లిదండ్రుల నుంచి చంద్రను దేవదాస్ ఎలా కాపాడతాడు అన్నదే సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ చివర్లో ఆమె పేరు చంద్రరా.. అంటూ ఓ బూతు పదంతో ముగుస్తుంది. దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో అనేక అసభ్య పదాలు ఉండటంతో వాటిని మ్యూట్ చేశారు. దీంతో సినిమా మొత్తం ఎలా ఉండబోతుందనే ఆసక్తితో పాటు కొంత సందేహం కూడా అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Full View
Tags:    

Similar News