కూలీ ఇంటర్వెల్ పై నెక్ట్స్ లెవెల్ ఎలివేషన్లు
కెరీర్లో అప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినా కొన్ని సినిమాలు మాత్రం చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కు కూడా అంతే.;
కెరీర్లో అప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినా కొన్ని సినిమాలు మాత్రం చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కు కూడా అంతే. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో సినిమాలతో వరుస హిట్లు అందుకున్న లోకేష్ త్వరలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
జోరుగా కూలీ ప్రమోషన్లు
కూలీ సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతుంది. అంటే రిలీజ్ కు మరో 10 రోజులు కూడా టైమ్ లేదు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయగా లోకేష్ కూడా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని కూలీ గురించి, పలు విషయాల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తున్నారు. అందులో భాగంగానే కూలీ ఇంటర్వెల్ సీన్ గురించి లోకేష్ చాలా హైప్ ఎక్కిస్తున్నారు.
ఆడియన్స్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా
రజినీకాంత్ తో తాను చేస్తున్న మొదటి సినిమా కావడంతో కూలీ ఇంటర్వెల్ చాలా స్పెషల్ గా ఉండాలనుకుని దాన్ని దాదాపు రెండేళ్ల పాటూ ప్లాన్ చేసుకున్నానని, సినిమా రిలీజయ్యాక ఇంటర్వెల్ బ్యాంగ్ కు ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతారో తెలుసుకోవడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నానని తెలిపారు. కూలీ సినిమా షూటింగ్ తనకెన్నో అందమైన జ్ఞాపకాలను అందించిందని, అందుకే షూటింగ్ అయిపోయినప్పుడు ఆఖరి రోజు బాధ పడ్డానని చెప్పారు లోకేష్.
శృతి కోసం స్వీట్స్ ఆర్డర్ చేసిన రజినీ
సినిమా చేస్తున్నప్పుడు సినిమాలో ఓ సీన్ లో శృతి హాసన్ యాక్టింగ్ ను రజీనీ సర్ కు చూపిస్తే ఆయన అప్పుడు సైలెంట్ గానే ఉండి, ఆ తర్వాతి రోజు స్వీట్స్ ఆర్డర్ చేసి మరీ శృతికి ఇచ్చారని, సౌబిన్ యాక్టింగ్ కూడా ఆయన్నెంతో మెప్పించిందని లోకేష్ చెప్పారు. ఇదే సందర్భంగా అందరూ ఎంతో ఎదురుచూస్తున్న ఖైదీ2 గురించి కూడా లోకేష్ కనగరాజ్ స్పందించి మాట్లాడారు.
ఖైదీ2 లో ఆ రెండు క్యారెక్టర్లు
కూలీ రిలీజయ్యాక ఖైదీ2ను మొదలుపెడతానని చెప్పిన లోకేష్, ఆ సినిమాలో విక్రమ్, లియో సినిమాలోని క్యారెక్టర్లను చూపించనున్నానని, ఇప్పటికైతే కేవలం 35 పేజీల కథ మాత్రమే రాశానని చెప్పారు. దీన్ని బట్టి చూస్తుంటే ఖైదీ2 సెట్స్ పైకి వెళ్లడానికి కాస్త సమయం పట్టేలానే ఉంది. ఖైదీ2తో పాటూ విక్రమ్ లోని ఏజెంట్ టీనా క్యారెక్టర్ తో ఓ స్పెషల్ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నానని, ఆ సిరీస్ ను వేరే డైరెక్టర్ తెరకెక్కిస్తారని లోకేష్ వెల్లడించారు.
అందుకే ఆ సినిమా రిజెక్ట్ చేశా
కూలీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న పరాశక్తి సినిమాలో విలన్ గా నటించలేకపోయానని, పరాశక్తి కోసం డైరెక్టర్ సుధా కొంగరను రెండు సార్లు కలిశానని, ఆమె చెప్పిన కథ కూడా నచ్చిందని, ఆ క్యారెక్టర్ చేయాలనుకున్నప్పటికీ కూలీ సినిమాను త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనతోనే ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్టు చెప్పారు లోకేష్. అయితే త్వరలోనే అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు లోకేష్ తెలిపారు.