బాలీవుడ్ బ్యూటీతో లోకేష్.. ప్లాన్ ఏంటీ?

కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి అందరికీ తెలిసిందే. నాలుగన్నరేళ్ళు బ్యాంకులో పనిచేసి సినిమాలపై మక్కువతో జాబ్ ను వదిలేశారు;

Update: 2025-10-30 09:38 GMT

కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి అందరికీ తెలిసిందే. నాలుగన్నరేళ్ళు బ్యాంకులో పనిచేసి సినిమాలపై మక్కువతో జాబ్ ను వదిలేశారు. కస్టమర్ డిలైట్ అనే షార్ట్ ఫిల్మ్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. సినీ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన అవియల్ అనే ఇండిపెండెంట్ ఆంతాలజీ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు.

ఆ తర్వాత మా నగరం మూవీ ద్వారా దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం కార్తీతో ఖైదీ, విజయ్‌ దళపతితో మాస్టర్‌, లియో, కమల్‌ హాసన్‌ తో విక్రమ్‌, రజనీకాంత్‌ తో కూలీ వంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు. కూలీ సినిమా తర్వాత మరో మూవీని ఇప్పటి వరకు లోకేష్ కనగరాజ్.. మొదలుపెట్టలేదు.

కూలీ తర్వాత ఖైదీ 2 సినిమా స్టార్ట్ చేస్తారని చెప్పారు. కానీ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. అమీర్ ఖాన్ తో చేయనున్న మూవీపై అప్డేట్ రాలేదు. అయితే లోకేష్ కనగరాజ్.. హీరోగా డెబ్యూ ఇవ్వనున్నారని కొద్ది రోజులుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. పూజా కార్యక్రమాలు కూడా జరిగినట్లు తెలుస్తోంది.

కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రం ఫ్రేమ్‌ అరుణ్‌ మాదేశ్వరన్‌ దర్శకత్వంలో హీరోగా లోకేశ్ నటించబోతున్నట్లు తెలుస్తుండగా.. యాక్టర్ గా డెబ్యూ మూవీ సినిమా కోసం ఫైట్స్‌ సహా పలు విద్యల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందారని సమాచారం. చిత్రం కోసం ఆయన తన బాడీ లాంగ్వేజ్‌ ను కూడా పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఆ సినిమాలో లోకేష్ కనగరాజ్ సరసన కన్నడ భామ రచితా రామ్‌ హీరోయిన్ గా నటిస్తుందని రీసెంట్ గా టాక్ వినిపించింది. కూలీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో మెప్పించిన బ్యూటీ.. లోకేష్ డెబ్యూ మూవీలో యాక్ట్ చేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆమెను కాదని, బాలీవుడ్ బ్యుటీని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

బీటౌన్ క్రేజీ బ్యూటీ వామిగా గబ్బిని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు సమాచారం. అయితే ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన ఆమె.. బాలీవుడ్ తోపాటు సౌత్ లో కూడా మంచి ఫేమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అడివి శేష్ గూఢచారి-2 మూవీలో యాక్ట్ చేస్తున్న వామిక.. ఇప్పుడు లోకేష్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినికిడి. అయితే G2, లోకేష్ మూవీ సహా ఆమె లైనప్ లో దాదాపు 8 సినిమాలకుపైగా ఉన్నాయట!

Tags:    

Similar News