లిటిల్ హార్ట్స్ టీజర్: మౌళి మిడిల్ క్లాస్ కితకితలు!
యూత్‌కి కావాల్సిన ఫన్, ఫ్రెష్‌నెస్, మధురమైన ఎమోషన్స్ అన్నీ ప్యాక్ అయ్యి ఉన్నట్లు ఈ గ్లింప్స్ చెబుతోంది.;
టాలీవుడ్‌లో మరో యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ మూవీ థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. మౌళి తనుజ్ ప్రసాంత్, శివాని నాగారం జంటగా నటించిన లిటిల్ హార్ట్స్ మూవీపై ఇప్పటికే యువతలో మంచి క్రేజ్ ఏర్పడింది. 90’s వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న మౌళి ఈసారి ఫుల్ లెంగ్త్ హీరోగా ప్రేక్షకులను అలరించబోతుండగా, అదే సిరీస్‌కు స్క్రిప్ట్ రాసిన ఆదిత్య హసన్ ఈ చిత్రంతో నిర్మాతగా మారగా సాయి మార్తాండ్ దర్శకత్వం వహించాడు.
బన్నీ వాస్ వర్క్స్, వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా విడుదలైన టీజర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. లిటిల్ హార్ట్స్ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. దాదాపు ఒక నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్‌లో మౌళి, శివాని మధ్య నడిచే సరదా సంభాషణలు, క్యాంపస్ లవ్ టచ్, ఫ్రెండ్స్ మజా అన్నీ కలిపి కనెక్ట్ అయ్యేలా చూపించారు.
యూత్‌కి కావాల్సిన ఫన్, ఫ్రెష్‌నెస్, మధురమైన ఎమోషన్స్ అన్నీ ప్యాక్ అయ్యి ఉన్నట్లు ఈ గ్లింప్స్ చెబుతోంది. "నో టచింగ్.. ఓన్లీ హార్ట్ టచింగ్" అనే ట్యాగ్ లైన్‌తో టీజర్‌ను ఎంటర్టైనింగ్‌గా కట్ చేశారు. మాటలు, పంచ్ లు టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి. 90’s నాస్టాల్జియా వాతావరణాన్ని గుర్తు చేస్తూనే యూత్ ఎనర్జీని బ్లెండ్ చేసి చూపించడం ప్రత్యేకంగా అనిపించింది.
ముఖ్యంగా మౌళి, శివాని జంట స్క్రీన్ మీద చాలా క్యూట్‌గా, ఫ్రెష్‌గా కనిపించారు. ఇద్దరి కెమిస్ట్రీని మేకర్స్ సరిగ్గా క్యాప్చర్ చేసినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, జై కృష్ణ వంటి నటులు కూడా భాగమవ్వడంతో మరింత ఆసక్తిని కలిగిస్తోంది. వారి టైమింగ్ కామెడీతో సినిమా మొత్తం ఎంటర్టైనింగ్‌గా ఉండబోతుందనే క్లారిటీ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా టీజర్‌లో ఎనర్జీని పెంచింది.
ఇంతవరకు టీజర్‌తో చూపించిన కంటెంట్‌ను బట్టి చూస్తే లిటిల్ హార్ట్స్ యూత్‌ను బాగా కనెక్ట్ చేసుకునేలా కనిపిస్తోంది. సరదా, కామెడీ, హార్ట్ టచ్ మోమెంట్స్ అన్నీ కలిపి ఒక ఫీల్ గుడ్ లవ్ కామెడీని ప్రేక్షకులకు అందించబోతున్నట్టు తెలుస్తోంది. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్స్ బన్నీ వాస్, వంశీ నందిపాటి భారీ స్థాయిలో రిలీజ్ చేస్తుండటం సినిమాకి అదనపు బలాన్ని ఇస్తోంది. మొత్తానికి సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రానున్న ఈ మూవీ ఆడియన్స్‌కి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్‌గా నిలిచే అవకాశం ఉంది.