అక్కినేని హీరోలకు పండగ.. అదే ట్రాక్ కంటిన్యూ అయితే..

కొన్ని విజయాలు కేవలం ఒక సినిమా వరకే పరిమితం కావు. ఒక ఫ్యామిలీ కొత్త జోష్ నింపుతాయి. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ అలాంటి వాతావరణమే కనిపిస్తోంది.

Update: 2026-07-21 06:12 GMT

కొన్ని విజయాలు కేవలం ఒక సినిమా వరకే పరిమితం కావు. ఒక ఫ్యామిలీ కొత్త జోష్ నింపుతాయి. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. లెనిన్ విజయంతో అఖిల్ అక్కినేనికి చాలా కాలం తర్వాత రిలీఫ్ ఇచ్చే రిజల్ట్ దక్కగా, నాగార్జున కామెంట్స్ ఆ ఆనందాన్ని మరింత క్లియర్ గా చూపిస్తున్నాయి. 'నాకు, చైతన్యకు, అఖిల్‌ కు పండగలా ఉంది. మా ఇల్లంతా కళకళలాడుతోంది' అని నాగార్జున చెప్పడం వెనుక ఉన్న ఎమోషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

గత కొన్నేళ్లుగా అక్కినేని హీరోలకు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. నాగార్జున సినిమాలు, నాగచైతన్య ప్రాజెక్టులు, అఖిల్ కెరీర్‌ జర్నీ.. అన్నింటిలోనూ కొన్ని ఇబ్బందులు కనిపించాయి. ముఖ్యంగా అఖిల్ విషయంలో సరైన కమర్షియల్ హిట్ కోసం అభిమానులు కూడా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలో లెనిన్ రూపంలో వచ్చిన సక్సెస్ అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేకంగా మారింది.

సినిమా విడుదలైన తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఫోన్లు చేసి హౌస్‌ ఫుల్ షోలు నడుస్తున్నాయని, ఎక్స్ ట్రా షోలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పినప్పుడు ఎంతో ఆనందంగా అనిపించిందని నాగార్జున చెప్పడం విశేషం. ఒక నిర్మాతగా, తండ్రిగా, నటుడిగా ఆయనకు ఆ సక్సెస్ ఎంత ముఖ్యమో ఆ మాటల్లో కనిపించింది. ప్రేక్షకులు, అభిమానులు చూపించిన ప్రేమకు మూవీ టీమ్ థ్యాంక్స్ చెప్పింది.

లెనిన్ సక్సెస్ మీట్ లో కూడా అదే జోష్ కనిపించింది. హైదరాబాద్‌ లో నిర్వహించిన బ్లాక్‌ బస్టర్ వైభవం ఈవెంట్ లో నాగచైతన్య చీఫ్ గెస్ట్ గా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు మెమోంటోస్ అందజేస్తూ సక్సెస్ ను పంచుకున్నారు. అఖిల్‌ కు వస్తున్న ప్రశంసలపై ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆనందం వ్యక్తం చేశారు.

ఆ విజయం కేవలం ఒక సినిమా కలెక్షన్ల కథ మాత్రమే కాదు. అఖిల్ కెరీర్‌ కు కొత్త దిశ చూపించే ఛాన్స్ కూడా. ఇప్పటివరకు తనపై ఉన్న డౌట్స్ తొలగిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యే అవకాశం లెనిన్ ద్వారా దక్కిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యూత్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఫ్యూచర్ ప్రాజెక్టులకు స్ట్రాంగ్ గా మారే అవకాశం ఉంది. అక్కినేని ఫ్యామిలీకి ప్రస్తుతం మూడు జెనరేషన్ల ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది. నాగార్జునకు ఉన్న స్టార్ ఇమేజ్, నాగచైతన్యకు ఉన్న ప్రత్యేక గుర్తింపు, అఖిల్‌ కు యూత్ లో పెరుగుతున్న క్రేజ్ కలిసి వస్తే పరిస్థితి మరింత మారవచ్చు.

అందుకే లెనిన్ సక్సెస్ ను ఫ్యాన్స్ సాధారణ హిట్‌ గా కాకుండా కొత్త జర్నీగా చూస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి అక్కినేని హీరోల రాబోయే సినిమాలపైనే ఉంది. లెనిన్ ఇచ్చిన సక్సెస్ ను అఖిల్ కొనసాగించగలిగితే, నాగచైతన్య తన తదుపరి చిత్రాలతో అదే జోరు చూపగలిగితే, అక్కినేని కుటుంబానికి నిజంగానే ఇది పండగల సీజన్‌ గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం నాగార్జున చెప్పినట్లే.. అక్కినేని ఇంట్లో ఆనందం కనిపిస్తోంది. అదే ట్రాక్‌ హీరోలు కొనసాగిస్తే, అది మరికొంత కాలం కొనసాగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News