'బెస్ట్ యాక్టర్ 2026 అఖిల్ అక్కినేని'.. అభిమానుల కోలాహాలం!
అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ 'లెనిన్' గ్రాండ్ సక్సెస్ మీట్ గుంటూరు వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. స్టేడియం కిక్కిరిపోయేలా 'ఊక వేస్తే రాలనంత మంది జనం' ఈ వేడుకకు హాజరయ్యారు.
అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ 'లెనిన్' గ్రాండ్ సక్సెస్ మీట్ గుంటూరు వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. స్టేడియం కిక్కిరిపోయేలా 'ఊక వేస్తే రాలనంత మంది జనం' ఈ వేడుకకు హాజరయ్యారు. ఈవెంట్ కి భారీగా అభిమానులు తరలి రావడంతో పోలీస్ బందోబస్త్ కూడా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
అఖిల్ బాబు బ్లాక్‌బస్టర్.. ప్రశంసల వర్షం!
ఈవెంట్ జరుగుతుండగా అభిమానుల కోలాహాలం మరో రేంజుకు చేరుకుంది. అక్కినేని అభిమానులు తమ 'చిన్నోడు' అఖిల్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ల స్క్రీన్ ప్రెజెన్స్ - నటన అద్భుతంగా ఉన్నాయని అభిమానులు కొనియాడారు. ''ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం మరొకటి లేదు'' అంటూ సినిమా థీమ్‌ను పొగుడుతూ.. ఈ సినిమా అఖిల్ కెరీర్‌లోనే 'ఫస్ట్ బ్లాక్‌బస్టర్' అని, 'బెస్ట్ యాక్టర్ 2026 అఖిల్ అక్కినేని' అంటూ అభిమానులు నినదించారు. ఒక చాట్ సెషన్ లో మెగా అభిమానులు కూడా అఖిల్ సినిమా సక్సెస్ సాధించినందుకు అభినందనలు తెలపడం విశేషం.
స్టేజ్ మీదకు 'ఫ్యాన్ నాగరాజు' రావాలంటూ డిమాండ్!
అక్కినేని అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న 'ఫ్యాన్ నాగరాజు' ఈ ఈవెంట్‌కు వచ్చాడా లేదా అన్న చర్చ కూడా ఫ్యాన్స్ లో జోరుగా సాగింది. ''ఫ్యాన్ నాగరాజు వచ్చాడా?..ఈ ఈవెంట్‌కు నాగరాజును తీసుకురాకపోతే వేస్ట్''... ''అతడిని స్టేజ్ మీదకు పిలవాలి'' అంటూ పలువురు నెటిజన్లు పదే పదే కామెంట్లు పెట్టారు. అఖిల్ వీరాభిమాని అయిన నాగరాజును స్టేజ్ ఎక్కించడమే ఈ ఈవెంట్‌కు అసలైన కిక్ ఇస్తుందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
సినిమా ఫంక్షన్‌లో రాజకీయ రచ్చ!
ఈ సినిమా ఈవెంట్ చాట్ బాక్స్‌ను కొందరు నెటిజన్లు రాజకీయ రచ్చకు వేదికగా మార్చేశారు. ఏపీ రాజకీయాల ప్రస్తావన తెస్తూ.. ''వైఎస్ జగన్'', ''కూటమి ప్రభుత్వం'' అంటూ పరస్పర విమర్శలు చేసుకున్నారు. దీనిపై సినిమా ప్రేక్షకులు స్పందిస్తూ.. ''సినిమా ఫంక్షన్‌లో ఈ రాజకీయాలు ఎందుకు?'' అని ప్రశ్నిస్తూ క్లాస్ తీస్కున్నారు.
అయితే ఈ ఈవెంట్ లైవ్ ప్రసారంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'లైవ్ రావడం లేదు', 'లైవ్ పెట్టారా లేదా?', 'నో లైవ్ ఈజ్ రిసీవింగ్' అంటూ చాలా మంది కామెంట్లు చేశారు. కొందరు నెటిజన్లు అయితే లైవ్ అప్‌డేట్ సరిగ్గా ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని, నిరసనను వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ లో జోష్ చూస్తుంటే అక్కినేని హీరో అఖిల్ తో పాటు, అతడి కుటుంబంలోను బోలెడంత జోష్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఈవెంట్లో అఖిల్ తో పాటు అతడి సతీమణి కూడా కనిపించడం మరో ప్రధాన ఆకర్షణగా మారింది.