మోహన్ లాల్ 'ఎంపురాన్'.. ఓటీటీ పరిస్థితేంటి?
మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్.. రీసెంట్ గా L2 ఎంపురాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;
మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్.. రీసెంట్ గా L2 ఎంపురాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఆ సినిమా.. మార్చి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై రివ్యూస్ కాస్త మిక్స్ డ్ గా వచ్చినా.. వసూళ్లు మాత్రం భారీగా వచ్చాయనే చెప్పాలి.
విడుదలైన నాలుగున్నర రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్ లో చేరి ఎంపురాన్ అబ్బురపరిచింది. ఆ తర్వాత ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన (రూ.250+ కోట్లు) మలయాళ మూవీగా అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. వాస్తవానికి.. కొన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురైనా.. వసూళ్లు మాత్రం భారీగా రాబట్టడం విశేషమే.
అయితే తాజాగా ఓటీటీలోకి ఎంపురాన్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. నిన్నటి (మార్చి 24) నుంచి ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్ లో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్ భాషల్లో సందడి చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే జియో హాట్ స్టార్.. సోషల్ మీడియాలో కొత్త పోస్టర్ ను విడుదల చేసింది.
ఇక ఇప్పుడు ఎంపురాన్ కు ఓటీటీలో అనుకున్నంత స్థాయిలో వ్యూస్ దక్కడం లేదని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఓటీటీ ప్రేక్షకులు.. ఆ సినిమాను చూసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని సమాచారం. మోహన్ లాల్ వంటి స్టార్ హీరో ఉన్నప్పటికీ.. ఓటీటీలో సందడి ఎక్కువగా లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో సినిమాపై ఇప్పటికీ ఇంకా మీమ్స్, ట్రోల్స్ కనిపిస్తున్నాయి. వాటి ప్రభావం ఉందని చెప్పడం లేదు కానీ, ఓటీటీలో మాత్రం ఎంపురాన్ అనుకున్న స్థాయిలో రాణించడం లేదని తెలుస్తోంది. అయితే స్ట్రీమింగ్ అయ్యి ఒక్క రోజే అయింది.. మెల్లగా ఎక్కే అవకాశం లేదని చెప్పలేం. అందుకే ఇప్పుడేం నిర్ణయించలేం కూడా.
ఇక సినిమా విషయానికొస్తే.. లూసిఫర్ కు రీమేక్ గా వచ్చిన ఎంపురాన్ లో మోహన్ లాల్ తో పాటు అభిమన్యు సింగ్, మంజు వారియర్, టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్, జెరెమీ ఫ్లైన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఆంటోనీ పెరంబవూర్, సుభాస్కరన్, గోకులం గోపాలన్ గ్రాండ్ గా రూపొందించారు. దీపక్ దేవ్ మ్యూజిక్ అందించారు.