కుబేర: కమ్ముల మేకింగ్ కి 19 కట్స్.. ఇది పెద్ద ట్విస్టే..

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కుబేర సినిమా పట్ల ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.;

Update: 2025-06-18 10:02 GMT
కుబేర: కమ్ముల మేకింగ్ కి 19 కట్స్.. ఇది పెద్ద ట్విస్టే..

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కుబేర సినిమా పట్ల ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. శేఖర్ కమ్ముల స్టైల్‌కు భిన్నంగా, ఈసారి ప్రేక్షకులకు కొత్తదనాన్ని చూపించబోతున్నట్లు ఇప్పటికే టీజర్, సాంగ్స్ ద్వారా స్పష్టం అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, స్టార్ క్యాస్ట్ ప్రెజెన్స్ సినిమా హైప్‌ను మరింత పెంచాయి.


ఇప్పటికే ట్రైలర్‌కు విశేష స్పందన లభించగా, సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే రిలీజ్ ముందు మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) U/A సర్టిఫికేట్ ఇచ్చిన ఈ చిత్రానికి సెన్సార్ అనంతరం 19 సీన్లను తొలగించారు. దాదాపు 13 నిమిషాల 41 సెకన్ల నిడివిని కలిగిన ఈ కట్స్, శేఖర్ కమ్ముల ప్రయోగాత్మక దృష్టికోణాన్ని సూచిస్తున్నాయి.

సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాల్లో ఎమోషనల్ ఎలిమెంట్స్, నేచురల్ న్యారేషన్ ప్రధానంగా ఉంటాయి. కానీ కుబేర విషయంలో మాత్రం సామాజికంగా ఓ ఘనమైన మెసేజ్ చెప్పేందుకు ఆయన ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్, సోషల్ లైన్స్, హ్యూమన్ సైకాలజీకి సంబంధించిన కొన్ని సీన్ల విషయంలో కొద్దిపాటి ట్రిమ్ సూచనలు అందినట్లు తెలుస్తోంది. అయితే కథకు సంబంధించిన ఫ్లో ఎక్కడ తగ్గకుండానే మళ్ళీ ఎడిటింగ్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కుబేర సినిమాకు జరిపిన 19 కట్స్‌ పెద్ద ట్విస్ట్ అనే కామెంట్స్ వస్తున్నాయి. కమ్ముల సినిమా అంటేనే సెన్సార్ సబ్యులకు పెద్దగా టెన్షన్ ఉండదు అనే అభిప్రాయం ఉంటుంది. కానీ ఆయన గతంలో ఎప్పుడు లేనంతగా ఈసారి పని పెట్టారు. నెగెటివ్‌గా కాకుండా, మెరుగైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ కోసం కమ్ముల ఈసారి గట్టిగానే ఆలోచించారని అర్ధమవుతుంది.

ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ కుబేర సినిమా బుక్ మై షోలో టాప్ ట్రెండింగ్ గా నిలవడం, 12 వేల టికెట్లకు పైగా 24 గంటల్లో అమ్ముడవడం చూస్తేనే, సినిమా మీద ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో తెలుస్తోంది. మరి 19 సీన్లు తొలగించిన తర్వాత థియేట్రికల్ కట్ ఎంత ఇంపాక్ట్ చూపెడుతుందో 20వ తేదీ తారీఖున రాబోయే అసలు పరీక్ష చెబుతుంది. సినిమా చూసిన తరువాత సరస్వతి దేవి తల ఎత్తుకునేలా ఉంటుంది అనే విషయాన్ని కమ్ముల ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బలంగా చెప్పాడు. మరి సినిమా ఆ రేంజ్ లో ఉంటుందో లేదో చూడాలి.

Tags:    

Similar News