'కుబేర' ఫస్ట్ ఛాయిస్ నాగార్జున కాదా?
పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమాకు ఫస్ట్ డే , ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు బాగుతున్నాయి.;
ధనుష్ కథానాయకుడిగా నటించిన ఎమోషనల్ డ్రామా `కుబేర`. కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటించింది. సెన్సిబుల్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల ఈ మూవీని తన పంథాకు భిన్నంగా సరికొత్త నేపథ్యంలో తెరకెక్కించారు. బిజినెస్ పరంగానూ, కంటెంట్ పరంగానూ చర్చనీయాంశంగా మారిన `కుబేర` రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమాకు ఫస్ట్ డే , ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు బాగుతున్నాయి. తొలి రోజు `కుబేర` రూ.30 కోట్ల మేర వసూళ్లని రాబట్టినట్టుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని, మ్యాజికల్ ఫిగర్‌ని `కుబేర` రీచ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ మూవీలో బిచ్చగాడి పాత్రలో ధనుష్ పలికించిన హావ భావాలు, కీలక పాత్రలో నాగ్ కనిపించిన తీరుకు ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ మూవీలోని కీలక పాత్ర కోసం ముందు దర్శకుడు శేఖర్ కమ్ముల నాగార్జునని అనుకోలేదని, ఆ క్యారెక్టర్ కోసం మలయాళ సూపర్ స్టార్ ని అనుకున్నానని తెలిసింది. `కుబేర`లో ధనుష్‌తో పాటు మరో క్యారెక్టర్ కూడా కీలకం. కథను నడిపించే పాత్ర అది. సినిమాకు అత్యంత కీలకమైన మాజీ సీబీఐ ఆఫీసర్ క్యారెక్టర్‌ని మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చేత చేయించాలనుకున్నారట. ఒకసారి ఆయనకు కథ కూడా చెప్పారట. మరోసారి చెప్పాలని ఆయన అడిగితే శేఖర్ కమ్ముల తన వద్దకు వెళ్లలేదట.
ఆ క్యారెక్టర్‌ని కింగ్ నాగ్‌తో చేయించాలన్నది శేఖర్ కమ్ముల ఆలోచన. ఆ కారణంగానే నాగార్జునని కలిసి ఆయనని ఒప్పించారట. ముందు కలిసినప్పుడు మాత్రం కింగ్ సీబీఐ ఆఫీసర్ క్యారెక్టర్ చేయనన్నారట. తాను హీరోగా కొనసాగుతున్నానని, అలాంటిది ఇలాంటి క్యారెక్టర్ ఎలా చేస్తానని చెప్పి రిజెక్ట్ చేశారట. కానీ శేఖర్ కమ్ముల మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన వెంటపడి ఫైనల్‌గా నాగ్‌ను ఒప్పించి సినిమా చేయించాడట. అలా మోహన్‌లాల్ వరకు వెళ్లిన `కుబేర` తిరిగి మళ్లీ నాగా్ వద్దకు రావడం, అది కార్యరూపం దాల్చి కింగ్ క్యారెక్టర్‌కు ప్రశంసలు దక్కుతున్నాయి.