కృతి శెట్టి ఇంకా వెయిటింగ్ లోనే..?

ఉప్పెన భామ కృతి శెట్టి తొలి సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుని ఆ తర్వాత ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయింది.;

Update: 2025-10-30 06:53 GMT

ఉప్పెన భామ కృతి శెట్టి తొలి సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుని ఆ తర్వాత ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ఉప్పెన ఆ తర్వాత శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు ఈ 3 సినిమాలు అమ్మడికి మంచి బజ్ తీసుకు రాగా ఇక ఆ తర్వాత చేసిన ప్రతి సినిమా గ్రాఫ్ పడిపోయేలా చేసింది కానీ అమ్మడికి ఏమాత్రం వర్క్ అవుట్ అవ్వలేదు. చివరగా మనమే అంటూ శర్వానంద్ తో ఒక అటెంప్ట్ చేసింది. అది కూడా ఆడియన్స్ ని ఏమాత్రం ఇంప్రెస్ చేయలేకపోయింది. బేబమ్మగా పాపులారిటీ తెచ్చుకున్నా కూడా కృతికి అసలు ఛాన్స్ లు రావట్లేదు.

అమ్మడు తమిళ్ లో ప్రయత్నాలు..

ఐతే తెలుగులో ఎలాగు అవకాశాలు లేవని అమ్మడు తమిళ్ లో తన ప్రయత్నాలు మొదలు పెట్టింది. రవి మోహన్ తో జినీ సినిమా ఏడాది క్రితమే చేసినా అది ఇంకా రిలీజ్ కాలేదు. డిసెంబర్ లో ఆ సినిమా రిలీజ్ ఉండొచ్చని తెలుస్తుంది. మరోపక్క యూత్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ తో ఎల్.ఐ.కె అంటూ మరో సినిమా చేసింది కృతి శెట్టి. ఆ సినిమా అసలైతే ఈ దీవాళీకి రిలీజ్ అవ్వాల్సింది కానీ డ్యూడ్ రిలీజ్ ఉండటం వల్ల ప్రదీప్ ఎల్.ఐ.కె వాయిదా పడింది.

ప్రదీప్ డ్యూడ్ కూడా సూపర్ హిట్ అయ్యింది కాబట్టి కృతి శెట్టి ఎల్.ఐ.కె మీద తన హోప్స్ అన్ని పెట్టుకుంది. అంతేకాదు ప్రదీప్ సినిమాలు తెలుగులో కూడా మంచి బజ్ ఏర్పరచుకుంటున్నాయి. అలా బేబమ్మ మళ్లీ టాలీవుడ్ లో తనపై డిస్కషన్ జరగాలని చూస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో తనకు సరైన ఛాన్స్ రాబట్టుకునే వరకు పట్టు వదలట్లేదు అమ్మడు.

గ్లామర్ తో బుట్టలో పడేయాలనే ప్లాన్..

ఈమధ్య సోషల్ మీడియా ఫోటో షూట్స్ లో కూడా తన స్కిన్ షోతో ఎట్రాక్ చేస్తుంది. ఫోటో షూట్స్ వల్ల ఛాన్స్ లు వస్తాయా అన్నది కన్ఫర్మ్ గా చెప్పడం కష్టం కానీ ఆడియన్స్ కి తన గ్లామర్ తో బుట్టలో పడేయాలనే ప్లాన్ మాత్రం చాలా మంది హీరోయిన్స్ కి బాగానే వర్క్ అవుట్ అయ్యింది. ఎల్.ఐ.కె, జినీ రెండు సినిమాలు కూడా డిసెంబర్ లోనే రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నాయి. ఈ రెండు సినిమాలు సక్సెస్ ఐతే కోలీవుడ్ లో అయినా బిజీ అవ్వాలని చూస్తుంది కృతి శెట్టి.

ఐతే పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న టాలీవుడ్ మీదే కృతి ఫస్ట్ ఫోకస్ చేస్తుందని తెలుస్తుంది. ఐతే ఉప్పెన హిట్ తర్వాత వచ్చిన ప్రతి ఛాన్స్ ని కాదనకుండా చేసిన అమ్మడు ఆ టైం లోనే కాస్త ఆచి తూచి స్టోరీస్ ఎంపిక చేసుకుని ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని చెప్పొచ్చు.

Tags:    

Similar News