షార్ట్ ఫ్రాక్ లో కృతి అందాలు..

థిక్ గ్రీన్ కలర్ ప్రింటెడ్ మినీ ఫ్రాక్ ధరించిన ఈమె తన అందాలతో మేని ఛాయ తో అందరిని ఫిదా చేసేసింది.;

Update: 2025-10-26 10:22 GMT

ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా వాడకం ఎక్కువగా పెరిగిపోయింది.. అందుకే ఎవరికైనా పాపులారిటీ లభించాలి అంటే ఈ సోషల్ మీడియాను ఎక్కువగా సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. అటు హీరోయిన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్ వలకబోస్తూ రోజుకొక ఫోటో షేర్ చేస్తూ అభిమానులలో.. ఫాలోవర్స్ లో ఎక్కడలేని పాపులారిటీ దక్కించుకుంటున్నారు. ముఖ్యంగా ఇంట్లో జరిగే విషయం మొదలుకొని తమ వ్యక్తిగత జీవితంలో జరిగే విషయాల వరకు అలాగే సినిమా షూటింగ్లకు సంబంధించిన ఇలా ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.

 

ఒకప్పుడు హీరోయిన్స్ ని కలవాలి అంటే ఎంతో కష్టం అయ్యేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత వారితో నేరుగా మెసేజ్లు చేస్తున్నారు. మాట్లాడుతున్నారు కూడా.. అలా సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చేసింది.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకొని సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రముఖ హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో బిజీబిజీగా గడిపేసి ఇప్పుడు అవకాశాల కోసం మళ్లీ సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. అలాంటి వారిలో కృతి శెట్టి కూడా ఒకరు అని చెప్పవచ్చు.

 

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే 100 కోట్లకు క్లబ్లో చేరిపోయిన ఈ ముద్దగుమ్మ.. ఈ సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు అంటూ వరుసగా హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తరువాత వరుసగా ఆఫర్లు తలుపు తట్టాయి. కానీ ఏ చిత్రం కూడా ఈమెకు విజయాన్ని అందించలేదు. అలా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్ , మాచర్ల నియోజకవర్గం, కస్టడీ , మనమే అంటూ పలు చిత్రాలు చేసింది. కానీ ఏవి కూడా ఆకట్టుకోలేదు. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా గ్లామర్ షో చేస్తున్న విషయం తెలిసిందే.

 

అందులో భాగంగానే తాజాగా మినీ ఫ్రాక్ ధరించిన ఈమె అందులో తన అందాలను చూపిస్తూ అబ్బురపరిచింది. థిక్ గ్రీన్ కలర్ ప్రింటెడ్ మినీ ఫ్రాక్ ధరించిన ఈమె తన అందాలతో మేని ఛాయ తో అందరిని ఫిదా చేసేసింది. మొత్తానికి అయితే కృతి శెట్టి తన అందాలతో మరొకసారి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు. ఇక అమ్మడి అందానికి అభిమానులే కాదు నెటిజన్స్ కూడా ఫిదా అవుతూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

కృతి శెట్టి ప్రస్తుతం ప్రదీప్ రంగనాథనాన్ తో కలిసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అలాగే వా వాతియార్, పెద్ది, జెనీ, ఖలీఫా వంటి చిత్రాలలో కూడా నటిస్తోంది ఇందులో పెద్ది, ఖలీఫా వచ్చే ఏడాది విడుదల కాబోతున్నాయి. ప్రస్తుతం ఈమె ఆశలన్నీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ పైనే ఉన్నాయి. మరి ఈ సినిమా అయినా ఈమెకు సక్సెస్ అందిస్తుందేమో చూడాలి. ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు.

Tags:    

Similar News