అంతా కలలా మిగిలిపోయింది..

ఘట్టమనేని కృష్ణ..ఈ పేరుకు సినీ ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ముఖ్యంగా ఒకప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ ని క్రియేట్ చేసి కౌబాయ్ సినిమాలను ఇండస్ట్రీకి తీసుకువచ్చిన హీరోగా కృష్ణ అనే చెప్పుకుంటారు.;

Update: 2025-11-15 09:02 GMT

ఘట్టమనేని కృష్ణ..ఈ పేరుకు సినీ ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ముఖ్యంగా ఒకప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ ని క్రియేట్ చేసి కౌబాయ్ సినిమాలను ఇండస్ట్రీకి తీసుకువచ్చిన హీరోగా కృష్ణ అనే చెప్పుకుంటారు. అంతేకాదు ఒకే సంవత్సరంలో ఏకంగా 17, 18 సినిమాలను చేసిన మొట్టమొదటి హీరో కూడా కృష్ణనే.. అంతేకాదండోయ్ విజయనిర్మలతో 48, జయప్రద తో 46 కి చిత్రాలు చేసి.. ఒకే హీరోయిన్ తో అత్యధిక సినిమాలు చేసిన హీరోగా రికార్డు సృష్టించారు. అలాంటి కృష్ణ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు వరుస సినిమాలను చేస్తూ బిజీ బిజీగా లైఫ్ లో గడిపేవాడు. అటు ఫ్యామిలీని చూసుకుంటూనే ఇటు సినిమాలు చేసేవాడు. అలా ఎన్నో సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా తన కెరీర్ ని కొనసాగించిన ఈయన.. వయసు మీద పడ్డాక కూడా పలు సినిమాల్లో తాత,తండ్రి క్యారెక్టర్లు పోషించారు.

అయితే అలాంటి కృష్ణ 2022 నవంబర్ 15న మరణించిన సంగతి మనకు తెలిసిందే. విజయ నిర్మల మరణించాక కృష్ణ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. అంతలోనే తన కళ్ళ ముందే చెట్టంత కొడుకును పోగొట్టుకున్నాడు. అలా రమేష్ బాబు 2022 జనవరిలో మరణించాడు. కొడుకు పోయిన బాధలో నుండి తేరుకోక ముందే మొదటి భార్య ఇందిరాదేవి సెప్టెంబర్ లో మరణించింది. అలా ఒకే ఏడాదిలో ఇద్దరినీ కోల్పోయిన కృష్ణ మరింత కృంగిపోయారు. అలా చివరికి అదే ఏడాదీ నవంబర్ 15న ఆయన కూడా మరణించారు.

అయితే కృష్ణ చనిపోయి నేటికి మూడు సంవత్సరాలు అవుతోంది. దీంతో తండ్రి మరణాన్ని తలుచుకొని కూతురు మంజుల, కొడుకు మహేష్ బాబు ఎమోషనల్ పోస్టులు పెట్టారు. అలా మహేష్ బాబు తన ట్విట్టర్ వేదికగా "ఈరోజు నీ గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నాను.. మరియు నువ్వు గర్వంగా ఉంటావని తెలుసు నాన్న" అంటూ ఎమోషనల్ ట్వీట్ పెట్టారు.

అలాగే కృష్ణ కూతురు మంజుల కూడా తండ్రి మరణాన్ని తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. "మీరు చనిపోయి మూడు సంవత్సరాలవుతుంది.. అయినప్పటికీ ఇది నిన్నటి లాగే అనిపిస్తోంది. అంతా కలలా మిగిలిపోయింది" అంటూ ఇంస్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

ప్రస్తుతం మహేష్ బాబు, మంజుల ఇద్దరు తండ్రి మరణాన్ని తలుచుకొని ఎమోషనల్ అవుతూ పెట్టిన పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్స్ కృష్ణ మరణాన్ని తలుచుకొని బాధ పడుతున్నారు. అలా ఒక గొప్ప సినీ దిగ్గజంగా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న కృష్ణ మరణం ఎంతో మందిని కలచివేసింది.




Tags:    

Similar News