వీరమల్లు.. క్రిష్ కథ మారిందట..!

ఐతే క్రిష్ వీరమల్లుని ఎలా అనుకున్నారో ఆడియన్స్ కు తెలియదు. ఐతే లేటెస్ట్ గా ఘాటి రిలీజ్ ప్రమోషన్స్ లో వీరమల్లు గురించి ప్రస్తావించారు క్రిష్.;

Update: 2025-09-02 07:53 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా జూలై 25న రిలీజైంది. ఐతే ఈ సినిమాను డైరెక్టర్ క్రిష్ మొదలు పెట్టగా ప్రాజెక్ట్ దాదాపు నాలుగేళ్లు సెట్స్ మీద ఉండే సరికి వేరే కమిట్మెంట్స్ వల్ల క్రిష్ వీరమల్లు నుంచి తప్పుకున్నాడు. మిగతా సినిమాను జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశారు. ఐతే హరి హర వీరమల్లు సినిమా ఫైనల్ రిజల్ట్ అందరికీ తెలిసిందే. కొన్ని సీన్స్ బాగున్నాయి మరికొన్ని సీన్స్ అలా అలా నడిపించారన్న టాక్ వచ్చింది.

ఘాటి రిలీజ్ ప్రమోషన్స్ లో..

ఐతే క్రిష్ వీరమల్లుని ఎలా అనుకున్నారో ఆడియన్స్ కు తెలియదు. ఐతే లేటెస్ట్ గా ఘాటి రిలీజ్ ప్రమోషన్స్ లో వీరమల్లు గురించి ప్రస్తావించారు క్రిష్. తాను అనుకున్న కథ పూర్తిగా వేరని అన్నారు క్రిష్. తన కథ దర్బార్ లో షూటింగ్ జరుగుతుంది. ఆల్రెడీ దీని కోసమే అన్నపూర్ణ స్టూడియోస్ లో సెట్ కూడా వేశాం.. కోహినూర్ ని దొంగిలించిన తర్వాత పవన్ కళ్యాణ్ మయూర్ సింహాసనం మీద నిల్చోవడం.. ఆ తర్వాత ఔరంగజేబుకి సవాలు విసరడం.. ఈ సన్నివేశాలన్నీ తానే తీశానని అన్నారు క్రిష్.

ఐతే సెకండ్ పార్ట్ లో తాను తీసింది 40 నిమిషాలు ఉంటుంది. చాలా గొప్ప ఉద్దేశ్యంతోనే ఈ సినిమా చేశా ఐతే ఆ సినిమా మీద అప్పటికే ఐదేళ్లు పనిచేశాం.. అటు పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ కోసం టైం కేటాయించాల్సి వచ్చింది. అందుకే షెడ్యూల్ కుదరలేదు. ఇక ఆ టైం లోనే కొత్త డైరెక్టర్ రావాల్సిందే అని తాను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా అన్నారు క్రిష్.

వీరమల్లు 40 నిమిషాలు క్రిష్ డైరెక్షన్ లో..

పవన్ కళ్యాణ్, ఏ.ఎం.రత్నం ఇద్దరు అంటే ఎంతో ఇష్టమని అన్నారు క్రిష్. పవన్ కళ్యాణ్ చాలా గొప్ప వ్యక్తి అంతా మాట్లాడుకున్న తర్వాతే వీరమల్లు నుంచి ఎగ్జిట్ అయ్యానని అన్నారు క్రిష్. ఆయన డైరెక్షన్ లో అనుష్క లీడ్ రోల్ లో నటించిన సినిమా ఘాటి. సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నారు క్రిష్ జాగర్లమూడి. సో హరి హర వీరమల్లు మొత్తం సినిమాలో 40 నిమిషాలు క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కించారని తెలుస్తుంది.

సినిమాను ఒక డైరెక్టర్ మొదలు పెట్టి మరో డైరెక్టర్ పూర్తి చేసి రిలీజ్ చేస్తే కచ్చితంగా ఇలాంటి పరిస్థితే వస్తుంది. వీరమల్లు సినిమాకు క్రిష్ అప్పటికే నాలుగేళ్ల దాకా పనిచేశాడు. ఐతే పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ వల్ల సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఐతే క్రిష్ తప్పుకున్న తర్వాత జ్యోతి కృష్ణ వీరమల్లు దర్శకత్వ బాధ్యతలు అందుకున్నారు. హరి హర వీరమల్లు పార్ట్ 2 కూడా ఉంది. ఐతే దానికి మాత్రం పవన్ కళ్యాణ్ స్పెషల్ ఇంట్రెస్ట్ తో కాస్త టైం కేటాయించాలని చూస్తున్నారట.

Tags:    

Similar News