వీరమల్లు.. క్రిష్ కూడా బిజీబిజీగా..

టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి గురించి అందరికీ తెలిసిందే. తన మేకింగ్ అండ్ టేకింగ్ తో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.;

Update: 2025-07-16 08:30 GMT

టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి గురించి అందరికీ తెలిసిందే. తన మేకింగ్ అండ్ టేకింగ్ తో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. స్పెషల్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఘాటీ మూవీతో బిజీగా ఉన్నారు. స్టార్ హీరోయిన్ అనుష్క లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

అయితే దాని కన్నా ముందు క్రిష్ దర్శకత్వం వహించిన హరిహర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించారు. భారీ బడ్జెట్ తో ఏఎం రత్నం దర్శకత్వం వహించిన ఆ చిత్రం.. ఇప్పుడు జులై 24న రిలీజ్ కానుంది.

ఐదేళ్ల పాటు సెట్స్ పై ఉన్న ఆ మూవీ.. థియేటర్స్ లో మరో ఎనిమిది రోజుల్లో సందడి చేయనుంది. దీంతో ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. అయితే క్రిష్.. వీరమల్లు మూవీకి ముందు దర్శకుడిగా వ్యవహరించారు. మూడేళ్ల పాటు పనిచేశారు. షూటింగ్ ను చాలా వరకు కంప్లీట్ చేశారు. స్క్రిప్ట్ ను సినిమా రూపంలో మార్చారు.

ఆ తర్వాత అనూహ్యంగా ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు క్రిష్. దీంతో జ్యోతి కృష్ణ ఆ బాధ్యతలు తీసుకుని సినిమాను కంప్లీట్ చేశారు. కానీ క్రిష్ ను మాత్రం ఎవరూ మర్చిపోరు. సినిమాకు సంబంధించిన పూర్తి అవగాహన ఆయనకు ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే 75 శాతం చిత్రీకరణ పూర్తి చేశారని టాక్ ఉంది.

అయితే ఇప్పుడు వీరమల్లు ప్రమోషన్స్ టైమ్ లో ఆయన కనపడకపోవడంతో సినీ ప్రియులు, అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఒక్కటంటే ఒక్క ఈవెంట్ లో కూడా సందడి చేయకపోవడంతో పెద్ద లోటుగా భావిస్తున్నారు. కనీసం ఒక్క ఇంటర్వ్యూ అయినా ఇస్తారని ఆశించినా.. అది కూడా లేదని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. కానీ ప్రమోషన్స్ కు వచ్చినా రాకపోయినా కష్టాన్ని ఎప్పుడూ మర్చిపోమని అంటున్నారు.

అదే సమయంలో క్రిష్ కు ఇప్పుడు వీరమల్లు ప్రమోషన్స్ లో పాల్గొనే అంత టైమ్ లేదని మరికొందరు చెబుతున్నారు. ఎందుకంటే ఆయన తెరకెక్కిస్తున్న ఘాటీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడంతో కొత్త డేట్ ప్రకటించలేదు. దీంతో వాటిని దగ్గరుండి పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే వీరమల్లు ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదని సమాచారం. మరి నిజమేంటో ఆయనకే తెలియాలి.

Tags:    

Similar News