ఒంట‌రిగా నాపై నాకున్న న‌మ్మ‌కంతో బ్ర‌తికేస్తున్నా!

హాస్య న‌టి కోవై స‌ర‌ళ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. కోలీవుడ్ న‌టి అయినా తెలుగులో ఎంతో ఫేమ‌స్.

Update: 2024-05-16 00:30 GMT

హాస్య న‌టి కోవై స‌ర‌ళ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. కోలీవుడ్ న‌టి అయినా తెలుగులో ఎంతో ఫేమ‌స్. బ్ర‌హ్మానందం-కోవై స‌ర‌ళ కామెడీ ట్రాక్స్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అంత ద‌గ్గ‌ర చేసింది. న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకుంది. న‌ట‌న‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన శైలి ఉంద‌ని నిరూపించిన న‌టి. ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు బుల్లి తెర‌పైనా రాణిస్తున్నారు. ఇలా న‌టిగా ఆమె జీవితం ప‌రిపూర్ణం. అయితే వ్య‌క్తిగ‌త జీవితంలో ఆమె ఇంకా సింగిల్. ఆమె వ‌య‌సు 61 ఏళ్లు. పెళ్లి చేసుకోలేదు.

పేరు ప్ర‌ఖ్యాతలు..కీర్తి ప్ర‌తిష్ట‌లు..గొప్ప విజ‌యాలు ఉన్నా! వివాహ బంధానికి మాత్రం ఆమె దూరంగా ఉన్నారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. ` పెళ్లి చేసుకోకపోతే ఎట్లా ? రేపటి రోజున ఎవరు చూస్తారు? అని అంతా అడుగుతున్నారు. ఇక్కడ ఎవరూ ఎవరినీ చూస్తారనే గ్యారెంటీ లేదు. పిల్లలు విదేశాలకి వెళ్లిపోయి .. భర్తను కోల్పోయిన వాళ్లు ఏం చేస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? జీవితంలో ఏం జరుగుతుంది? దేనికి భయపడాలి? నన్ను చూడటానికి ఎవరో రావాలని నేను కోరుకోను.

Read more!

నాపై నాకున్న నమ్మకంతోనే బ్రతికేస్తాను. నా వల్ల వీలైనంత సాయం చేస్తాను. రేపటి సంగతి రేపు ఆలోచన చేస్తాను. దాని గురించి ఇప్పటి నుంచే ఆలోచించి టెన్ష‌న్ తీసుకోవ‌డం క‌న్నా! ఇప్పుడు ఎలా ఉన్నాం అన్న‌ది నా దృష్టిలో ముఖ్యం. మిగ‌తాది అతా ఆ పైవాడే చూసుకుంటాడు. నేను పుట్టి పెరిగింది కోయంబత్తూర్ లో. మొదటి నుంచి ఎంజీఆర్ అభిమానిని. ఆయన సినిమాలు చూడ‌టం వ‌ల్లే నటనపట్ల ఆసక్తి ఏర్పడింది.

తెలుగులో అలీ గారు .. బ్రహ్మానందంగారి న‌టన అంటే ఇష్టం. నేను - బ్రహ్మానందం గారు కలిసి 100 సినిమాల్లో నటించి ఉంటాము. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషలో కలుపుకుని 900 సినిమాలలో నటించాను. ఇది నా ఒరిజినల్ వాయిస్. బాడీ లాంగ్వేజ్ అన్ని ఒరిజిన‌లే. ఇవి సినిమా కోసం తెచ్చిపెట్టుకున్నవి కాదు. నన్ను అంతా ఎలా చూస్తున్నారో ? అదే నేను` అని అన్నారు. ప్ర‌స్తుతం కోవై స‌ర‌ళ `ఆర‌ణ్మ‌నై-4`...పాన్ ఇండియా చిత్రం `కంగువా` లో న‌టిస్తున్నారు. అలాగే `డ‌బుల్ ట‌క్క‌ర్` అనే యానిమేటెడ్ మూవీ కూడా చేస్తున్నారు.

Tags:    

Similar News