ఆ మూవీ కాంతారను మించుతుందట!
సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.;
సాహిత్య అకాడమీ అవార్డ్ విన్నర్ సుధీర్ అత్తవర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కొరగజ్జ. త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ మూవీ, త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. కర్ణాటక, కేరళలోని కరావళి ప్రాంతంలో ముంబైలోని కొన్ని ఏరియాల్లో పూజించే ప్రధాన దేవత కొరగజ్జ చుట్టూ ఈ సినిమా స్టోరీ ఉంటుంది.
సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీతో తాను సంగీతంలో సరికొత్త ప్రయోగాలను చేశానని అన్నారు.కొరగజ్జ సినిమాకు మ్యూజిక్ పరంగా చాలా పరిశోధన చేయాల్సి వచ్చిందని తన అనుభవాన్ని గురించి పంచుకున్నారు. కొరగజ్జ కోసం గత చరిత్రను తెలుసుకోవాల్సి వచ్చిందని అందుకే మ్యూజిక్ చేయడానికి ఎక్కువ టైమ్ పట్టిందని గోపీ సుందర్ తెలిపారు.
తులునాడు లోని ఆచారవ్యవహాలు, కల్చర్ ను అర్థం చేసుకుని ట్యూన్స్ కంపోజ్ చేశానని, మొత్తం ఈ సినిమాలో ఆరు సాంగ్స్ ఉన్నాయని వాటిలో వేటికవే స్పెషల్ గా అనిపిస్తాయని తెలిపారు. కొరగజ్జలోని సాంగ్స్ శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, శంకర్ మహదేవన్, జావేద్ అలీ, అర్మాన్ మాలిక్, స్వరూప్ ఖాన్ లాంటి ప్రముఖ సింగర్స్ పాడారని గోపీ సుందర్ వెల్లడించారు.
ఈ సినిమా కాంతార కంటే భిన్నంగా ఉంటుందని, 800 ఏళ్ల నాటి గిరిజనుల సంబంధిత దేవుడి కథతో ఈ సినిమా తెరకెక్కుతుందని డైరెక్టర్ సుధీర్ అత్తవర్ తెలిపారు. కర్ణాటక, కేరళలో వేలమంది దేవతలున్నారని, అందులో కాంతర సినిమాలో ఒకరిని మాత్రమే చూపించారని, ఈ పరిశోధనలో ఈపీ శ్రీ విద్యాధర్ శెట్టి తనకెంతో సాయం చేశారని సుధీర్ తెలిపారు. ఈ మూవీలో కబీర్ బేడి, సందీప్ సోపార్కర్, శృతి, భవ్య కీలక పాత్రల్లో నటించగా, త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.