దశాబ్దం తర్వాత కెప్టెన్ కుర్చి ఎక్కిన నయా విలన్!
కోలీవుడ్ స్టార్ ఎస్.జె సూర్య కొంత కాలంగా నటుడిగానే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నటుడైన తర్వాత దర్శకుడి బాధ్యతలు వదిలేసాడు.;
కోలీవుడ్ స్టార్ ఎస్.జె సూర్య కొంత కాలంగా నటుడిగానే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నటుడైన తర్వాత దర్శకుడి బాధ్యతలు వదిలేసాడు. దర్శకుడిగా ఎలాంటి విజయాలు అందించాడో...నటుడిగా అంతకు మించిన గొప్ప విజయాలు తన నటనతో అందిస్తున్నాడు. ప్రతి నాయకుడి పాత్రలో సూర్య కు ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాల్లో అతడే విలన్ అవుతున్నాడు.
తెలుగు ఇండస్ట్రీలోనూ మంచి అవకాశాలు వస్తున్నాయి. అప్పుడప్పుడు ప్రధాన పాత్రల్లోనూ అలరి స్తున్నాడు. దాదాపు దశాబ్ద కాలంగా ఇదే పనిలో ఉన్నాడు. అయితే తాజాగా సూర్య మళ్లీ కెప్టెన్ కుర్చీ ఎక్కాడు. పదేళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టాడు. సూర్య దర్శకత్వంలో `కిల్లర్` అనే ఓ చిత్రం తెరకె క్కుతోంది. ఇందులో అతడే హీరో. ప్రీతి ఆస్రాని హీరోయిన్ గా నటిస్తోంది.
శ్రీ గోకులం మూవీస్ తో కలిసి సూర్య సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రమిది. పాన్ ఇండియాలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాపై టీమ్ ఎంతో కాన్పిడెంట్ గా కనిపిస్తుంది. ప్రేక్షలకు కొత్త అనుభూతిని పంచే చిత్రమవుతుందని మేకర్స్ తెలిపారు. సూర్య తమిళ సినిమాలకే కాక దర్శకుడిగా తెలుగు సినిమాలకు పనిచేసిన సంగతి తె లిసిందే.
పవన్ కళ్యాణ్ హీరోగా `ఖుషీ` తెరకెక్కించాడు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ . ఆ తర్వాత మళ్లీ చాలా కాలానికి అతడితోనే `కొమరం పులి` చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయినా ప్లాప్ అయింది. ఇక నటుడిగా `స్పైడర్`, `సరిపోదా శనివారం` లాంటి తెలుగు చిత్రాలతో సూర్య టాలీవుడ్ లో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.