కాంతారా చాప్టర్ 1కి స్టార్ క్రికెటర్ రివ్యూ..!
కాంతారా చాప్టర్ 1 సినిమా చూసిన టీం ఇండియా స్టార్ క్రికెటర్ కె.ఎల్ రాహుల్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు.;
కాంతారా చాప్టర్ 1 సినిమా చూసిన టీం ఇండియా స్టార్ క్రికెటర్ కె.ఎల్ రాహుల్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాజిక్ చూసి మైండ్ బ్లాక్ అయ్యిందని.. రిషబ్ శెట్టి మరోసారి అద్భుతాన్ని చేశారని. మంగళూరుకి చెందిన అందమైన ప్రజలను ఈ సినిమా రిప్రెజంట్ చేస్తుందని తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు కె.ఎల్ రాహుల్. రాహుల్ కర్ణాటకకు చెందిన క్రీడాకారుడు అని తెలిసిందే. ఎలాంటి ఇన్నింగ్స్ లో అయినా తన బ్యాటుతో ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తాడు రాహుల్. ప్రస్తుతం జరుగుతున్న వెస్టిండీస్ టెస్ట్ సీరీస్ లో కూడా రాహుల్ సెంచరీతో తన సత్తా చాటాడు.
క్రీడాకారులు ముఖ్యంగా క్రికెట్ ఆటగాళ్లు..
క్రీడాకారులు ముఖ్యంగా క్రికెట్ ఆటగాళ్లు తమకు నచ్చిన సినిమాల గురించి సోషల్ మీడియాలో డిక్సస్ చేస్తారు. గ్రౌండ్ లో ఉన్నంత సేపు.. ఆటకి సిద్ధమవుతున్న టైం లో మిగతా విషయాలు ఆలోచించరు కానీ తమ ఫ్రీ టైం లో నచ్చిన సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఓ విధంగా నచ్చిన సినిమా చూసి ఉత్సాహ పరచడం కూడా వారి ఫోకస్ కి కారణమని చెప్పొచ్చు. కాంతారా చాప్టర్ 1 చూసి కె.ఎల్ రాహుల్ తన సోషల్ మీడియా స్టేటస్ లో సినిమా గురించి అద్భుతంగా రాసుకొచ్చాడు.
ఐతే కేవలం అతను కర్ణాటకకు చెందిన ప్లేయర్ కాబట్టి అతను అలా పెట్టి ఉండాలని చెప్పలేం. ఎందుకంటే కొంతమందికి నచ్చిన సినిమా అది ఎలాంటి భాషలో వచ్చినా కూడా నచ్చితే ఒక కామెంట్ పెడుతుంటాడు. మన టీం ఇండియా ప్లేయర్స్ ఇదివరకు చాలామంది బాలీవుడ్ స్టార్ సినిమాల గురించి ప్రస్తావించారు. అంతేకాదు సూపర్ హిట్ సెన్సేషనల్ అయిన పుష్ప రాజ్ మేనరిజం తగ్గేదేలే అన్న సైన్ ని చాలామంది ప్లేయర్స్ విక్టరీ టైం లో చూపించారు.
జోష్ ఫుల్ మూమెంట్స్ ని గ్రౌండ్ లో ప్రదర్శిస్తారు..
అలా సినిమాలకు సంబంధించిన జోష్ ఫుల్ మూమెంట్స్ ని గ్రౌండ్ లో తమ ఫోకస్ ని తెలియచేసేలా ప్రదర్శిస్తారు. కాంతారా చాప్టర్ 1 పై రాహుల్ కామెంట్ కచ్చితంగా మరికొంతమంది క్రికెటర్స్ ఆ సినిమా చూసేలా చేస్తుందని చెప్పొచ్చు. రాహుల్ కి మాత్రమే కాదు కాంతారా 1 చూసిన ఆడియన్స్ ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో రిషబ్ శెట్టి యాక్టింగ్ చూసి మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా. యాక్టింగ్ అంటే ఇది అనిపించేలా రిషబ్ పూనకాలతో ఊగిపోయాడు. అందుకే ఈ సినిమాకు రావాల్సినంత క్రెడిట్ వస్తుంది. కాంతారా చాప్టర్ 1 ని రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి యాక్టింగ్ చేశాడు. ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ కూడా మరో హైలెట్ అని చెప్పడంలో సందేహం లేదు.