బెల్లంకొండ యూ టర్న్.. ఆ తేదీకే రాబోతున్న కిష్కింధపురి
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం ఒక వినూత్నమైన ప్రాజెక్ట్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.;
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం ఒక వినూత్నమైన ప్రాజెక్ట్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కిష్కింధపురిbపేరుతో వస్తున్న ఈ హారర్ ఫాంటసీ డ్రామా ప్రారంభం నుంచే ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్‌తో పాటు మిస్టీరియస్ టచ్ కలిపి ఈ సినిమాను ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దుతున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. స్టైలిష్ లుక్ లో బెల్లంకొండ కనిపించడం, టెక్నికల్ వర్క్, విజువల్స్ అన్ని కలిపి పెద్ద ఎత్తున పాజిటివ్ టాక్ తెచ్చాయి. ముఖ్యంగా విజువల్ ప్రెజెంటేషన్ హై రేంజ్‌లో ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించడం సినిమాకి మరో అట్రాక్షన్‌గా మారింది.
ఇప్పుడు రిలీజ్ డేట్‌పై ఉన్న కన్ఫ్యూజన్‌కు ఫుల్ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. తొలుత సెప్టెంబర్ 12న విడుదల అవుతుందని ప్రకటించగా, తర్వాత 13కి వాయిదా పడుతుందంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజా అప్డేట్ ప్రకారం, కిష్కింధపురి అదే మొదట అనుకున్నట్టుగా సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రానుంది. ఈ క్లారిటీతో బెల్లంకొండ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రేపు ఉదయం 11:07 గంటలకు ట్రైలర్ విడుదల కానుందని కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.
ఇప్పటికే పోస్టర్స్‌లో చూపించిన విజువల్స్ అలాగే టెలిఫోన్ టవర్ వద్ద నిలబడి ఉన్న బెల్లంకొండ, అనుపమ కంగారుగా చూస్తున్న సీన్ ప్లాట్‌పై సస్పెన్స్ క్రియేట్ చేసింది. దీనితో ట్రైలర్‌లో ఏమి చూపించబోతున్నారు అనే ఆసక్తి మరింతగా పెరిగింది. నిర్మాత సాహు గారపాటి ఈ సినిమాను ఎలాంటి రాజీ లేకుండా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారని సమాచారం.
దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి తన స్టైల్‌లో సస్పెన్స్, ఫాంటసీ, హారర్ మిక్స్ చేసి సినిమాను ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నారు. “చావు కబురు చల్లగా” తర్వాత ఆయనకు ఇది మరో కీలక పరీక్షగా మారనుంది. టెక్నికల్ టీమ్‌లో మ్యూజిక్, విజువల్స్, డిజైన్ వర్క్ అన్నీ హైలైట్ అవుతాయని ట్రేడ్ టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద, రిలీజ్ డేట్‌పై ఉన్న సస్పెన్స్ క్లియర్ కావడంతో ఇప్పుడు ఫ్యాన్స్ కౌంట్‌డౌన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. మరీ కిష్కింధపురి సెప్టెంబర్ 12న థియేటర్లలో ఎలాంటి వైబ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.