ఫ్యామిలీ హీరోయిన్ సినిమాకు A సర్టిఫికెట్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా సినిమా కిష్కింధపురి.;
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా సినిమా కిష్కింధపురి. కౌశిక్ పెగిళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హార్రర్ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడంతో పాటూ సెన్సార్ పనుల్ని కూడా ముగించుకుంది.
కిష్కింధపురికి ఎ సర్టిఫికెట్
తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న కిష్కింధపురి సినిమాకు సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ను జారీ చేసింది. అయితే ఈ సినిమాకు సెన్సార్ ఎలాంటి కట్ లేకుండానే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. పిల్లలను ఈ హార్రర్ డ్రామాకు దూరంగా ఉండాలని, పిల్లలు ఈ సినిమా చూడకూడదని కూడా సెన్సార్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. సెన్సార్ పూర్తైనప్పటికీ ఇంకా రన్ టైమ్ ఎంతనేది మాత్రం స్పష్టత రాలేదు.
కిష్కింధపురి ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్
రీసెంట్ గా రిలీజైన కిష్కింధపురి ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. సూపర్ నేచురల్ హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఎప్పుడూ క్యూట్ గా తన లుక్స్ తో ఎట్రాక్ట్ చేసే అనుపమ పరమేశ్వరన్ దెయ్యంలా కనిపించనున్నారు. అనుపమ మొదటిసారి దెయ్యం పాత్రలో కనిపించనుండటంతో అందరూ ఆమె క్యారెక్టర్ పై ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు.
డిఫరెంట్ గా ప్రమోషన్స్
ఓ పాడుబడిన దెయ్యాల కొంపల, అందులో దెయ్యం గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండే కొందరు వ్యక్తులు ఉండటం, ఆ తర్వాత వారికి ఎదురయ్యే సమస్యలతో ఈ సినిమా తెరకెక్కినట్టు ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. ఆల్రెడీ రిలీజైన ట్రైలర్ తో కిష్కింధపురిపై మంచి అంచనాలు ఏర్పడగా, మేకర్స్ ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా చాలా కొత్తగా చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ సినిమాస్ బ్యానర్ లో సాహు గారపాటి ఈ సినిమాను నిర్మించారు.