• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాలుగు రిలీజ్ లు.....

నాలుగు రిలీజ్ లు.. గ్రౌండ్ లెవెల్ కి K ర్యాంప్.. రిజల్ట్ డిసైడ్ చేసింది అదే..!

| కె ర్యాంప్ హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ఈ సినిమా హెవీ ఎంటర్ టైనర్ అని చెబుతూ వస్తున్నాం.

By - Ramesh Boddu
Update: 2025-10-19 07:22 GMT

యువ హీరో కిరణ్ అబ్బవరం లీడ్ రోల్ లో యుక్తి తరేజా హీరోయిన్ గా వచ్చిన సినిమా కె ర్యాంప్. జైన్స్ నాని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను హాస్య మూవీస్, రుద్రాం శ్ సెల్యులాయిడ్ బ్యానర్ పై రాజేష్ రండ, శివ బొమ్మ కలిసి నిర్మించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 18 శనివారం ఈ సినిమా గ్రాండ్ రిలీజైంది. సినిమా గురించి చిత్ర యూనిట్ స్పెషల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

కె ర్యాంప్ హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ఈ సినిమా హెవీ ఎంటర్ టైనర్ అని చెబుతూ వస్తున్నాం. మేము చెప్పినట్లే థియేటర్స్ లో దీపావళి పండుగను మా చిత్రంతో ఆడియెన్స్ సెలబ్రేట్ చేసుకుంటారనే నమ్మకం ఉంది. నవ్వించే సినిమా ఎప్పుడూ నిరాశపరచదు. ఈ రోజు కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. మాకు 17 డేట్ సెంటిమెంట్ ప్రకారం సరికాదని 18కు వచ్చాం. అయితే శుక్రవారం రిలీజ్ కు వచ్చి ఉండే నాలుగు రోజుల హాలీడేస్ లో అదనంగా మరో రోజు దొరికి ఉండేది.. కానీ శనివారం రిలీజ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు.

థియేటర్స్ లో ఆడియన్స్ అంతా కూడా సినిమా బాగుంది, మంచి ఎంటర్ టైనర్ అని చెబితే ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కడతారు. ఈ సినిమాను చాలా ఏరియాల్లో మా మూవీ ప్రచారం చేశాం. గ్రౌండ్ లెవెల్లో మా మూవీ గురించి ఉన్న క్రేజ్ చూశాక సినిమా మీద మరింత కాన్ఫిడెన్స్ పెరిగిందని అన్నారు కిరణ్ అబ్బవరం. ఈ సినిమాలో నేను చెప్పిన డైలాగ్స్ బాగా రీచ్ అయ్యాయి. వాటిని ఆడియెన్స్ నా ముందే చెబుతుంటే హ్యాపీగా ఉంది.

కె ర్యాంప్ సినిమా అంతా ఎనర్జీతో గోలగోలగా ఒక వైబ్ తో ఉంటుంది. ఇలాంటి సినిమా వచ్చి చాలా రోజులైందని అన్నారు కిరణ్ అబ్బవరం. కుమార్ అనే హీరో క్యారెక్టర్ మీద సినిమా వెళ్తుంది. క్యారెక్టర్ బేస్డ్ ఫిలింస్ ను మనం బాగా ఎంజాయ్ చేస్తాం కాబట్టి సినిమా ఫస్టాఫ్ యూత్ ఫుల్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటే, సెకండాఫ్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంగేజ్ చేస్తాయని అన్నారు. ఇప్పటికే నేను సక్సెస్, ఫెయిల్యూర్స్ చూశాను. వాటి విషయంలో మెచ్యూర్డ్ గా మారిపోయానని అన్నారు కిరణ్ అబ్బవరం. మనం ఎంత చేసినా కొన్నిసార్లు సక్సెస్ రాకపోవచ్చు. విజయం వచ్చిన ప్రతిసారీ చాలా పాజిటివ్ గా ఉంటుంది. ఐతే కిరణ్ అబ్బవరం సినిమా వస్తే తప్పకుండా బాగుంటుంది అనే ఇమేజ్ తెచ్చుకోవాలనేది ప్రస్తుతం నా ప్రయత్నం అని అన్నారు.

ఫలితం ఎలా ఉన్నా పని చేసుకుంటూ వెళ్తున్నా. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన నేను ఈ సినిమాలో రిచ్ కిడ్ గా నటించా. ఆ పాత్రలోకి వెళ్లడం కష్టమే. అయితే నా ఫ్రెండ్ ఒకరిని రిఫరెన్స్ తీసుకున్నా. అతను రిచ్ కిడ్. అతను ఎలా బిహేవ్ చేసేవాడో కొన్ని ఫాలో అయ్యానని అన్నారు. నాలుగు సినిమాలు పండక్కి రిలీజ్ అవుతుంటే కాంపిటేషన్, నెగిటివ్ ఎలిమెంట్స్ కూడా వస్తుంటాయి. అయితే ప్రేక్షకులు సినిమా చూసి ఇచ్చే పాజిటివ్ మౌత్ టాక్ సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేస్తుందని అన్నారు కిరణ్ అబ్బవరం..

సీనియర్ యాక్టర్ వీకే నరేష్ మాట్లాడుతూ.. కెరీర్ లో నా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాక సామజవరగమన మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అదే వరుసలో ఇప్పుడు కె ర్యాంప్లో కూడా కీ రోల్ చేశానని అన్నారు. కిరణ్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. కె ర్యాంప్ పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మా మూవీ తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం ఉందని చెప్పారు. అయితే ఏ రేంజ్ సక్సెస్ అనేది ఈ మూడు రోజుల్లో తెలుస్తుంది. మూడు తరాల ఆడియెన్స్ కలిసి చూసి ఎంజాయ్ చేసే చిత్రమిదని అన్నారు వీకే నరేష్.

డైరెక్టర్ నాని గురించి చెప్పాలంటే అతను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, అనిల్ రావిపూడి కాంబినేషన్ గా అనిపిస్తాడు. ఈ రోజు సమాజంలో ఉన్న పరిస్థితులనే సినిమా రిఫ్లెక్ట్ చేస్తుంది. హీరో కుమార్ అనే క్యారెక్టర్ లో కొంచెం అల్లరి చిల్లరగా ఉంటాడు. ఆ క్యారెక్టర్ కు తగినట్లే ఒకట్రెండు డైలాగ్స్ ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ కాదు మీరు సినిమా అంతా చూసి కె ర్యాంప్ ఎలా ఉందో చెప్పండని అన్నారు వీకే నరేష్.

కె ర్యాంప్ హీరోయిన్ యుక్తి తరేజా మాట్లాడుతూ.. ఈ చిత్రంలో కిరణ్, నా క్యారెక్టర్స్ పోటా పోటీగా ఉంటాయి. మేమిద్దరం కలిసి ఆ సీన్ ను ఎంత బాగా పర్ ఫార్మ్ చేయాలి అనేదాని గురించే ఆలోచించాం అని అన్నారు. కె ర్యాంప్ లో నేనొక డిఫరెంట్ రోల్ చేశాను. నా క్యారెక్టర్ పిచ్చిగా బిహేవ్ చేస్తుంటుంది. ఇదొక మంచి రొమాంటిక్ కామెడీ మూవీ. మూవీలో మా లవ్ స్టోరీ చాలా కనెక్ట్ అవుతుందని అన్నారు యుక్తి.

డైరెక్టర్ జైన్స్ నాని మాట్లాడుతూ.. కె ర్యాంప్ మూవీ కంప్లీట్ ఎంటర్ టైనర్ అనేది మేము ప్రచారంలో చెబుతూ వస్తున్నాం. థియేటర్స్ లో సినిమా చూసిన ఆడియెన్స్ నుంచి కూడా ఇదే ఫీడ్ బ్యాక్ వస్తుంది. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఒక ఫ్లోలో ఉండేలా స్క్రిప్ట్ చేశానని అన్నారు. అందుకే మా నరేష్ గారు అనిల్ రావిపూడితో నన్ను పోల్చుతున్నారని చెప్పుకొచ్చారు.

Tags:    
  • KiranAbbavaram 
  • KRamp 
  • JainsNani 
  • VKNaresh 
  • YuktiThareja 
  • HasyaMovies 
  • RudranshCelluloid 
  • DiwaliMovies 

Similar News

షారుక్ ఖాన్‌ ఒక్కో ఇల్లు రూ.50 కోట్లు.. అయినా కొనడానికి పోటీపడ్డ కుబేరులు!

2026-11-12 12:30 GMT

బయట 100 కెమెరాలు..లోపల వైట్ సోఫా రూల్!

2026-11-12 11:30 GMT

ఘనంగా మహేష్ బాబు మేనల్లుడి ప్రీ వెడ్డింగ్.. స్పెషల్ పోస్ట్ పంచుకున్న నమృత!

2026-11-12 11:00 GMT

‘వారణాసి’కి రామాయణం చేస్తున్న సాయం

2026-11-12 10:38 GMT

మామ్ గిల్ట్ అంటే ఏంటో అప్పుడే తెలిసింది!

2026-11-12 10:30 GMT

200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆభరణాలు.. కరీనాకపూర్ కు వారసత్వంగా ఇంకేం లభించాయంటే?

2026-11-12 10:05 GMT

'వారణాసి'.. ఏడాదిగా ఒక్కటేనా..

2026-11-12 09:54 GMT

ఇన్‌ఫ్లుయెన్సర్స్ నిజంగా ఆ రేంజ్ లో సంపాదిస్తున్నారా?

2026-11-12 09:45 GMT

నువ్వే నువ్వే నుంచి ఆదర్శ కుటుంబం వరకు.. త్రివిక్రమ్‌లో ఈ మార్పేంటి?

2026-11-12 08:18 GMT

తండ్రి కట్ చేసిన సీన్‌ను దొంగచాటుగా కలిపిన హృతిక్!

2026-11-12 08:17 GMT

సూర్యతో నాకు పోలికేంటి? ఆయన లెజెండ్!

2026-11-12 08:16 GMT

వారి గురించి ఆలోచించడం సోనూ సూద్‌ గొప్పతనం..!

2026-11-12 08:16 GMT

Copyright @2026

Powered by Blink CMS