10 రోజుల్లో 6 సినిమాలు ఒప్పుకున్నా..

నటుడిగా ఒక హీరోకు ఒక హిట్ పడిన తర్వాత ఆఫర్లు క్యూ కడతాయి. డైరెక్టర్లు కథలు పట్టుకొని వస్తే, ప్రొడ్యూసర్లు ఏకంగా చెక్కులు, డబ్బు కట్టలతోనే ఇంటికి వస్తారు.;

Update: 2025-10-18 10:14 GMT

నటుడిగా ఒక హీరోకు ఒక హిట్ పడిన తర్వాత ఆఫర్లు క్యూ కడతాయి. డైరెక్టర్లు కథలు పట్టుకొని వస్తే, ప్రొడ్యూసర్లు ఏకంగా చెక్కులు, డబ్బు కట్టలతోనే ఇంటికి వస్తారు. తమ బ్యానర్ లో సినిమా చేయాలని, భారీ రెమ్యూనరేషన్ ఇస్తామంటూ ఆఫర్లు ప్రకటిస్తారు. అయితే ఇండస్ట్రీలో ఏ నటుడైనా హీరోగా హిట్ అవ్వాలన్నా, లాంగ్ టైమ్ లో సక్సెస్ కొనసాగించాలన్నా.. కథల ఎంపిక అత్యంత కీలకం.

స్టోరీ ఎంపిక చేసుకునే విధానంలో మిస్టేక్ చేస్తే మాత్రం కెరీర్ గోవిందా. అప్పటిదాకా వచ్చిన ఫేమ్, అంతా పోతుంది. అయితే తానూ అలాంటి తప్పే చేశారని అన్నారు టాలీవుడ్ యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. తాను లెటెస్ట్ గా నటించిన కే ర్యాంప్ చిత్రం నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

కిరణ్ రాజావారు, రాణివారు సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ సినిమా మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత కరోనా తర్వాత 2021లో SR కళ్యాణమండపం సినిమా చేశారు. అదీనూ సక్సెస్ అయ్యింది. దీంతో కిరణ్ ఫేమ్ పెరిగింది. దీంతో ఆయన ఈ సక్సెస్ తర్వాత 10 రోజుల గ్యాప్ లోనే ఏకంగా 6 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. కానీ SR కళ్యాణమండపం సినిమా తర్వాత వరుసగా కిరణ్ ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారు. అప్పుడు తెలిసీ తెలియక ఒప్పుకున్న సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయాయి. దీంతో కిరణ్ కెరీర్ సందిగ్ధంలో పడింది.

రెండు సినిమాలు హిట్ అవ్వగానే వరుస ఛాన్స్ లు వచ్చాయి. ఇంకా ఎక్కడికో వెళ్లిపోయా అనుకున్నా. అయితే కథలు పాతవి కావడమో, నేను టెంప్ట్ అవ్వడం వల్లనో అవి మిస్ ఫైర్ అయ్యాయి. ప్రేక్షకులు కథల్లో మార్పు కోరుకుంటున్నారని తెలుసుకొని 2023లో ఫిక్స్ అయ్యాను. కేర్ ఫుల్ గా స్టోరీలు ఎంచుకుంటున్నా. డైరెక్టర్ ఎలా తీస్తారు? ఔట్ పుట్ ఎలా వస్తుంది అనే విషయాలపై చర్చించుకొని ఒప్పుకుంటున్నాను. క, కే ర్యాంప్ అలా ఎంపిక చేసుకున్నవే. అని కిరణ్ అన్నారు.

అందులో భాగంగా ఒప్పుకున్నదే క సినిమా. ఈ క సినిమాతో కిరణ్ మళ్లీ సక్సెస్ బాట పట్టారు. 2024 రిలీజైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన దిల్ రూబా మళ్లీ ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు కే ర్యాంప్ తో థియేటర్లలో సందడి చేస్తున్నారు.

Tags:    

Similar News