కె- ర్యాంప్ 'ఓనమ్'.. మ్యూజిక్ సిట్టింగ్ క్రేజీగా జరిగిందిలా!

టీజర్ తో సినీ ప్రియులను, అభిమానులను ఇంప్రెస్ చేసిన మేకర్స్.. ఇప్పుడు మరో అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.;

Update: 2025-08-07 12:40 GMT

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు కె- ర్యాంప్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. జెయిన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. ది రిచెస్ట్ చిల్లర్ గయ్ ట్యాగ్ లైన్ తో రూపొందుతోంది. రంగబలి ఫేమ్ యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తుండగా.. మాస్ ర్యాంపేజ్ చిత్రంగా కె ర్యాంప్ షూటింగ్ జరుపుకుంటోంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్ పై రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాలాజీ గుట్ట సహా నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కిరణ్ అబ్బవరం ఇప్పటివరకు చేయని జోనర్‌ లో సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ తో సినీ ప్రియులను, అభిమానులను ఇంప్రెస్ చేసిన మేకర్స్.. ఇప్పుడు మరో అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆగస్టు 9వ తేదీన ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు రీసెంట్ గా అనౌన్స్ చేశారు. పోస్టర్ కూడా రిలీజ్ చేసి హైప్ క్రియేట్ చేశారు.

కేరళ ప్రజలు ఎంతో సంతోషంగా, సంప్రదాయంగా జరుపుకొనే పండుగ ఓనమ్ పేరుతో సాంగ్ ఉండనుండగా.. మలయాళ ట్రెడిషన్ చూపిస్తూ కలర్ ఫుల్ గా సాంగ్ తీసినట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. అదే సమయంలో ఆ పాట మ్యూజిక్ సిట్టింగ్ వీడియోను ఇప్పుడు రిలీజ్ చేశారు. ఆ వీడియో కూడా అందరినీ ఆకట్టుకుంటోంది.

కె- ర్యాంప్ మొదటి సింగిల్ అనుకోకుండా ఉండవచ్చు కానీ ఇది పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. వీడియోలో కిరణ్ అబ్బవరం, డైరెక్టర్ జెయిన్స్ నాని.. మాట్లాడుతూ కనిపించారు. అప్పుడు నాని ఇండస్ట్రీలో పరిణామాలు చెబుతారు. అయితే ఇవి మనకు వద్దని, సినిమా కోసం చెప్పమని కిరణ్ అంటారు.

అప్పుడే చేతన్ భరద్వాజ్ ఎంట్రీ ఇవ్వగా, ఏం తీసుకుంటారని అడగ్గా.. విస్కీ అంటూ ఫన్నీగా చెబుతారు. ఆ తర్వాత ట్యూన్ ఇవ్వండని, హ్యాట్రిక్ కన్ఫర్మ్ అవ్వాలని, అలా పనిచేయాలని కోరుతారు. హీరో హీరోయిన్లు లవ్ లో ఉంటారని, కాలేజ్ లో ఓనమ్ ఫెస్టివల్ వస్తుందని, సెలబ్రేషన్ లో సెలబ్రేషన్ లా ఉండాలని జెయిన్స్ నాని చెబుతారు.

అప్పుడు చేతన్.. పలు ట్యూన్స్ చెప్పగా.. ఇప్పటికే పలు సినిమాల్లో ఉన్నాయని అంటారు. అప్పుడే కొత్త ట్యూన్ ను ప్లే చేస్తారు. ఇంకొటి ఇవ్వమని నాని అనగా.. వారం రోజుల టైమ్ కావాలని చేతన్ తెలిపారు. కానీ తొమ్మిదో తేదీ అని అనౌన్స్ చేశామని డైరెక్టర్ అంటారు. అప్పుడు ట్యూన్ అంటూ కొత్త ట్యూన్ ప్లే చేస్తే అదిరిపోయిందంటారు.

ఇంకో ట్యూన్ ప్లే చేయగా, రెండూ కలిపేయమని హీరో, డైరెక్టర్ చెబుతారు. ఆడియన్స్ కు అది నచ్చుతుందని అంటారు. అప్పుడే ఫుల్ ట్యూన్ ను ప్లే చేసి చూపిస్తారు చేతన్. దీంతో వావ్ అని కొనియాడుతారు. అయితే సాంగ్ మాత్రం అదిరిపోయేలా ఉండనుందని మ్యూజిక్ సిట్టింగ్ వీడియో ద్వారా అర్థమవుతోంది. మరి చూడాలి పాట ఎలా ఉండనుందో..

Full View
Tags:    

Similar News