• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నల్ల పిల్లితో అబ్బవరం...

నల్ల పిల్లితో అబ్బవరం ‘హతః’

| కానీ ఇందులో హీరో రోల్, కథ ఏంటి అనే విషయం కంటే ముందుగా ఒక నల్ల పిల్లినే చూపించారు. చిన్న వీడియోలో చీకటిగా ఉన్న పెట్టెలో పిల్లి కనిపిస్తుండగా, చివర్లో టైటిల్ రివీల్ చేశారు.

By - M Prashanth
Update: 2026-08-31 06:38 GMT

కిరణ్ అబ్బవరం నిర్మాతగా చేస్తున్న కొత్త సినిమా ‘హతః’ నుంచి మొదటి అప్డేట్ వచ్చింది. కానీ ఇందులో హీరో రోల్, కథ ఏంటి అనే విషయం కంటే ముందుగా ఒక నల్ల పిల్లినే చూపించారు. చిన్న వీడియోలో చీకటిగా ఉన్న పెట్టెలో పిల్లి కనిపిస్తుండగా, చివర్లో టైటిల్ రివీల్ చేశారు. పోస్టర్‌లో కూడా అదే పిల్లిని ఎర్రగా ఉన్న చేతులు పట్టుకుని కనిపించడం చూస్తే మొదటి నుంచే ఏదో వింత ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు ఉంది.

“పిల్లి బతికే ఉందా..?” అనే లైన్ కూడా వీడియో చివర్లో పెట్టారు. అసలు పిల్లి కథలో పాత్రేనా, లేక ఏదైనా గుర్తుగా మాత్రమే వాడారా అనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. కొద్దిరోజుల క్రితం సినిమా ప్రకటించినప్పుడు కూడా భయంకరమైన పక్షి కాలును పోలిన ఒక రూపం మాత్రమే చూపించారు. ఇప్పుడు నల్ల పిల్లిని ముందుకు తెచ్చారు. రెండు అప్డేట్స్ వచ్చినా కథ ఎక్కడ నడుస్తుందో మాత్రం ఇంకా బయటకు రాలేదు.

‘హతః’తో కిరణ్ ఈసారి హీరోగా కాకుండా నిర్మాతగా ఉన్నాడు. ఇటీవల ‘తిమ్మరాజుపల్లి టీవీ’తో నిర్మాతగా మొదటి సినిమా చేసిన అతను, ఇప్పుడు రెండో ప్రయత్నాన్ని పూర్తిగా వేరే జానర్‌లో తీసుకొస్తున్నాడు. మొదటి సినిమాలో దాదాపు 50 మంది కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వగా, ఇప్పుడు కూడా కొత్త టీమ్‌తోనే ముందుకు వెళ్తున్నాడు.

ఈ సినిమాకు అనూష్ గోరక్ కథ, దర్శకత్వంతో పాటు కెమెరా బాధ్యతలు కూడా చూసుకుంటున్నాడు. కుష్లూ మద్దాల, రెహమాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జేసిన్ జార్జ్ సంగీతం అందిస్తున్నాడు. కేఏ ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి సినిమాను నిర్మిస్తున్నాయి.

కిరణ్‌కు హీరోగా ప్రస్తుతం తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయినా వాటి మధ్యలో తన బ్యానర్ నుంచి మరో టీమ్ సినిమాను తీసుకురావడం స్పెషల్. పైగా తన పేరుతో ప్రచారం మొదలుపెట్టినా పోస్టర్‌లో తన ఫొటో పెట్టకుండా సినిమా కాన్సెప్ట్‌కే ఎక్కువ చోటిచ్చాడు. ‘హతః’ అనే పేరుకు అర్థం ఏంటి, నల్ల పిల్లికి దానితో సంబంధం ఏంటి అనే విషయాలు క్యూరియాసిటినీ క్రియేట్ చేశాయి.


బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో సర్‌ప్రైజ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం…

హీరోగా, డైరెక్టర్‌గా #KA13
ప్రొడ్యూసర్‌గా #Hatah

ఇప్పుడొచ్చిన #Hatah ఫస్ట్ లుక్‌లో మాత్రం…
అసలు కథేంటో చెప్పకుండా, ఒక పిల్లిని సెంట్రల్ ఆబ్జెక్ట్‌గా పెట్టి…

“Is the CAT alive… or…?”

అంటూ ఒక పూర్తి కాని… pic.twitter.com/7KlXtRqDgd

— Tupaki (@tupaki_official) August 31, 2026


ఇక తర్వాత వచ్చేది టీజర్. కిరణ్ కూడా “మీరు ఊహించనిది” అంటూ త్వరలో టీజర్ వస్తుందని చెప్పాడు. ఇప్పటివరకు నటీనటుల లుక్స్ కూడా పూర్తిగా బయటపెట్టలేదు. టీజర్‌లో కథకు సంబంధించిన మొదటి క్లూ ఇస్తారా, లేక నల్ల పిల్లి వెనక ఉన్న విషయం మాత్రమే బయటపెడతారా అన్నది అక్కడే తెలుస్తుంది.

Tags:    
  • hatah 
  • kiranabbavaram 
  • ka️productions 
  • pournamientertainments 
  • anushgorak 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS