కింగ్ డమ్: యూఎస్ లో సాలీడ్ ఓపెనింగ్స్.. డే 1 ఎంత రావచ్చు?

టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్ డమ్' సినిమా ఈరోజు థియేటర్లలో వేట మొదలు పెట్టింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు అన్ని ప్రాంతాల్లో మంచి హైప్ ఉంది.;

Update: 2025-07-31 05:12 GMT

టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్ డమ్' సినిమా ఈరోజు థియేటర్లలో వేట మొదలు పెట్టింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు అన్ని ప్రాంతాల్లో మంచి హైప్ ఉంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో సినిమా బజ్ మరింత పెరిగింది. ముఖ్యంగా, విడుదలకు ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగి, విజయ్ దేవరకొండ మార్కెట్‌పై మరోసారి నమ్మకం నిలిపాయి.

విదేశాల్లోనూ భారీ బుకింగ్స్

తెలుగు సినిమాలకి విదేశాల్లో ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడిన నేపథ్యంలో, 'కింగ్ డమ్' కూడా యూఎస్, కెనడా వంటి ప్రధాన ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ప్రీమియర్ షోల్ని నిర్వహించింది. ఈ ప్రీమియర్ షోలకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నైట్ షోలు ఎక్కువగా హౌస్‌ఫుల్‌గా మారడంతో సినిమా అంతర్జాతీయంగా సాలీడ్ ఓపెనింగ్‌ను అందుకుంది. ఇండస్ట్రీ ట్రాకర్లు చెబుతున్న వివరాల ప్రకారం, యూఎస్, కెనడాలోని మేజర్ సెంటర్లలో ఇప్పటికే టికెట్ అమ్మకాలు పీక్స్‌లోకి వెళ్లాయి.

నార్త్ అమెరికా వసూళ్లు అదిరిపోయేలా

నార్త్ అమెరికా ప్రీమియర్ షోల ద్వారా 'కింగ్ డమ్' ఇప్పటికే 900k డాలర్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇది విజయ్ దేవరకొండకు ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటి వరకు సాధించిన అత్యుత్తమ ఓపెనింగ్‌గా చెప్పొచ్చు. మిగిలిన షోలు, ఇండియన్ రిలీజ్ తర్వాత మొత్తం వసూళ్లు మిలియన్ డాలర్ మార్క్ దాటి రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉంది. దాదాపు 1 మిలియన్ టార్గెట్‌గా పెట్టుకుని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ స్థాయిలో సౌత్ హీరో సినిమాలు యూఎస్ మార్కెట్లో ఓపెన్ కావడం అరుదైన విషయం.

కెరీర్ బెస్ట్ ఓపెనింగ్?

ఇతర చోట్లా కూడా 'కింగ్ డమ్'కి అదే రేంజ్ బజ్ కనిపిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ బాక్సాఫీస్‌లో పలు ఫ్లాపుల తర్వాత విజయ్ దేవరకొండకి ఇది కమ్ బ్యాక్ తెచ్చే అవకాశం కల్పించనుంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు పెరిగి, అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయికి వెళ్లాయి. పీవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో, తెలుగు ఆడియన్స్ ఫోకస్ మొత్తం 'కింగ్ డమ్'పైకి మారింది. మాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ అందరికీ ఈ సినిమా ఎట్రాక్ట్ అయ్యేలా తెరకెక్కింది.

ఫస్ట్ డే కలెక్షన్స్

ప్రస్తుతం ట్రేడ్ వర్గాలు 'కింగ్ డమ్' మొదటి రోజు భారతదేశంలోనే రూ.17 నుంచి 19 కోట్లు నెట్ కలెక్షన్లు రాబడుతుందని అంచనా వేస్తున్నాయి. ఇదివరకు విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యుత్తమ ఓపెనింగ్ కలిగిన 'లైగర్' రూ.15.95 కోట్లు సాధించింది. అందువల్ల, ఈసారి 'కింగ్ డమ్' ఆ రికార్డును అధిగమించి విజయ్ కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్‌ని ఇవ్వనుందని స్పష్టంగా కనిపిస్తోంది. ఇంత భారీ ఓపెనింగ్స్ తర్వాత వారం ముగింపు వరకు సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి. విదేశాల్లో మిలియన్ డాలర్ మార్క్ దాటడం, ఇండియాలో భారీ స్టార్టింగ్ కలెక్షన్లు రావడం 'కింగ్ డమ్'కు మరింత సత్తా చూపించే అవకాశం కల్పిస్తోంది.

Tags:    

Similar News