విజయ్ మాస్ కాలిబర్ పట్టేసిన గౌతమ్..!
నెక్స్ట్ టాలీవుడ్ బిగ్ స్టార్ అవ్వడానికి విజయ్ దేవరకొండకు క్వాలిటీస్ ఉన్నాయని ప్రూవ్ చేసేలా అతని పర్ఫార్మెన్స్ ఉంది.;
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమా ఫైనల్ గా వచ్చేసింది. రౌడీ ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకోగా సినిమాను చూసి సూపర్ అనేస్తున్నారు. సగటు ప్రేక్షకుడు సినిమా చూసి నచ్చే అంశాలు ఉన్నాయి. కామన్ ఆడియన్ కి కావాల్సిన ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ ఇవన్నీ కింగ్ డం లో ఉన్నాయి. ఐతే స్పెషల్ గా విజయ్ దేవరకొండ ఇంటెన్స్ యాక్టింగ్ సూపర్ అనిపిస్తుంది. సూరి పాత్రలో విజయ్ చాలా కమిటెడ్ గా చేశాడు.
నెక్స్ట్ బిగ్ స్టార్ విజయ్ దేవరకొండ..
నెక్స్ట్ టాలీవుడ్ బిగ్ స్టార్ అవ్వడానికి విజయ్ దేవరకొండకు క్వాలిటీస్ ఉన్నాయని ప్రూవ్ చేసేలా అతని పర్ఫార్మెన్స్ ఉంది. కింగ్ డం సూరి పాత్రలో ఫస్ట్ ఫ్రేం నుంచి చివరి వరకు విజయ్ ఎక్కడ క్యారెక్టర్ ని వదల్లేదు. అంతేకాదు క్యారెక్టరైజేషన్ లోని డెప్త్ ని ఇంకా ఇంకా అర్ధం చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ లోని మాస్ క్యాలిబర్ ఏంటన్నది గౌతం తిన్ననూరి బాగా పట్టేశాడు. అందుకే ఎక్కడ లేపాలి.. ఎక్కడ ఎమోషనల్ గా చూపించాలని బాగా సెట్ చేసుకున్నాడు.
కింగ్ డంలో విజయ్ దేవరకొండ సూరి పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. సినిమాకు ప్రాణం పెట్టడం అంటారు కదా అలాంటిదే అన్నమాట. ఈమధ్య వచ్చిన సినిమాల్లో విజయ్ యాక్టింగ్ అతను బాగానే చేస్తున్నా ఎందుకో ఆ క్యారెక్టరైజేషన్ సూట్ అవ్వలేదు అన్నట్టుగా ఉండేది. కానీ కింగ్ డం చూస్తే అందులో సూరి పాత్రకు విజయ్ పర్ఫెక్ట్ అనిపిస్తాడు.
విజయ్, సత్యదేవ్ సెల్ సీన్స్..
విజయ్ దేవరకొండకు మంచి పేరు తెచ్చేలా కింగ్ డమ్ రోల్ ఉంది. ఇక విజయ్ తో పాటు మరో హీరో సత్యదేవ్ కూడా ఈ సినిమాతో అరుపులు పెట్టించాడు. ప్రీ క్లైమాక్స్ ఫైట్ లో సత్యదేవ్ రక్తపు మడుగుల్లో ఒళ్లంతా గాయాలతో చేసిన సీన్ అదిరిపోయింది. అతను హీరోగా చేసిన సినిమాల్లో కూడా ఇలాంటి సీన్ పడలేదని చెప్పొచ్చు.
ఇక జైల్లో విజయ్, సత్యదేవ్ సెల్ దగ్గర మాట్లాడే సీన్, ఇక పోర్ట్ దగ్గర ఎమోషనల్ సీన్ ఇలా ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డారు. సాటి హీరో అయినా తనకు ఇచ్చిన పాత్రకు సత్యదేవ్ అదరగొట్టాడు. విజయ్ కి ధీటుగా చేసి మెప్పించాడు. గౌతం సినిమా కథ మాత్రమే కాదు కాస్టింగ్ విషయంలో కూడా పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. ఐతే కింగ్ డమ్ సినిమాలో భాగ్య శ్రీ ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసింది. ఆమెకు చాలా తక్కువ సీన్స్ పడ్డాయి.