నాగ్ ను మెచ్చుకుంటున్న ఆడియన్స్.. ఎందుకంటే?
అయితే సినిమాల విషయం ఎలా ఉన్నప్పటికీ నాగ్ గత కొన్ని సీజన్లుగా బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ కు హోస్టింగ్ చేస్తూనే వస్తున్నారు.;
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ మధ్య తన రూట్ మొత్తాన్ని పూర్తిగా మార్చేశారు. సినిమాల దగ్గర్నుంచి స్టైలింగ్ వరకు ప్రతీ దాంట్లో కొత్తగా కనిపిస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నా సామిరంగ సినిమా తర్వాత నాగ్ హీరోగా ఇప్పటివరకు మరో సినిమా రాకపోయినా, కుబేర, కూలీ సినిమాల్లో కనిపించి ఆ పాత్రల్లో తనదైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు.
గత కొన్ని సీజన్లుగా బిగ్‌బాస్‌కు హోస్ట్ గా..
అయితే సినిమాల విషయం ఎలా ఉన్నప్పటికీ నాగ్ గత కొన్ని సీజన్లుగా బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ కు హోస్టింగ్ చేస్తూనే వస్తున్నారు. ఎప్పటిలానే ఈ ఏడాది బిగ్‌బాస్ కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కానీ నాగ్ హోస్టింగ్ ఈ ఇయర్ చాలా స్పెషల్ గా, ఎంతో హుందాగా అనిపిస్తుందని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.
గత వారం కంటెస్టెంట్ల దుమ్ము దులిపిన నాగ్
గతంలో బిగ్‌బాస్ హోస్టింగ్ విషయంలో చాలా డల్ గా కనిపిస్తున్నారని, షో ను ఎనర్జీతో నడిపించడం లేదని, ఏదో మొక్కబడిగా హోస్టింగ్ చేస్తున్నాడనే విమర్శలు ఎదుర్కొన్న నాగార్జున, ఈ ఇయర్ తన హోస్టింగ్ లో చాలా మార్పులు తీసుకొచ్చారు. మునుపెన్నడూ లేనంత ఎనర్జీతో నాగ్ ఈసారి సీజన్ ను నడిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా గత వారం నాగార్జున షోను హోస్ట్ చేసిన విధానానికి ఆయనకు విపరీతమైన ప్రశంసలొస్తున్నాయి. కంటెస్టెంట్స్ ను ట్రోల్ చేస్తూ, వారి ఆట విధానాన్ని మెరుగుపరిచేలా నాగ్ ఇచ్చిన సలహాలు, సూచనలు చాలా బావున్నాయని బిగ్ బాస్ ను చూస్తున్న ప్రతీ ఒక్కరూ అంటున్నారు.
మరింత రసవత్తరంగా వీకెండ్ ఎపిసోడ్స్
నాగ్ కామెడీ టైమింగ్ తో పాటూ అతని ఎనర్జీ బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్ ను మరింత రసవత్తరంగా మార్చడంతో పాటూ, ఆ ఎపిసోడ్ కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సీజన్ మొత్తం నాగ్ ఇదే తరహాలో కనిపిస్తే మాత్రం ఈ సీజన్ మరింత హిట్ అవడం ఖాయం. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటూ మొదలైన ఈ షో ఇప్పటికే బాగా పాపులరైంది.