స్నేహం ఒక మిథ్య.. స్టార్ హీరో తీవ్ర ఆవేదన!
ఇటీవల పైరసీ మ్యాటర్స్ లోను కిచ్చా సుదీప్ సీరియస్ టోన్ ప్రపంచానికి గొప్ప సందేశాన్ని పంపింది. పైరసీ కారణంగా నష్టపోయిన నిర్మాతల తరపున సుదీప్ బలమైన గొంతుకు వినిపించి అందరివాడు అని నిరూపించాడు.;
కిచ్చా సుదీప్ సూటిగా మాట్లాడుతూ, నిరంతరం వార్తల్లో నిలుస్తుంటాడు. ఇంతకుముందు కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాన్ని కాదనుకున్న హీరో అతడు. కొన్ని వ్యక్తిగత కారణాలతో అవార్డులు తీసుకోవడం ఆపేసానని, తనలాగే ప్రతిభ చూపిస్తూ ఎదుగుతున్న చాలా మంది నటులకు ఇలాంటి పురస్కారాలు ఇవ్వాలని మంచి మనసు చాటుకున్న హీరో అతడు.
ఇటీవల పైరసీ మ్యాటర్స్ లోను కిచ్చా సుదీప్ సీరియస్ టోన్ ప్రపంచానికి గొప్ప సందేశాన్ని పంపింది. పైరసీ కారణంగా నష్టపోయిన నిర్మాతల తరపున సుదీప్ బలమైన గొంతుకు వినిపించి అందరివాడు అని నిరూపించాడు. అంతేకాదు.. స్నేహం కోసం తన ఇరుగు పొరుగు భాషల హీరోల చిత్రాల్లోను అతడు నటించాడు. అడగగానే కాదనకుండా, సహాయక పాత్రల్లో నటించి తన మంచి మనసును చాటుకున్నాడు. సుదీప్ ఇంతకుముందు నాని ఈగలోను నటించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి `సైరా` చిత్రంలోను ఓ సహాయక పాత్రలో అతడు నటించాడు. కొందరి కోసం డబ్బు తీసుకోకుండానే అతడు నటించిన సందర్భాలున్నాయి. అయితే ఇండస్ట్రీలో సహచరుల గురించి, ఇరుగు పొరుగు భాషల్లో స్నేహితులైన హీరోల ఎక్కువగా ఆలోచించే అతడికి ఒక కష్టం వచ్చింది.
తాను నటించిన `మార్క్` చిత్రంలో అతిథి పాత్రల్లో నటించాల్సిందిగా కోరితే ఎవరూ తన కోసం ముందుకు రాలేదని, సహకరించలేదని ఆవేదన చెందాడు. `మార్క్` చిత్రం ఇటీవలే విడుదలైంది. ఓపెనింగ్ డే బెంగళూరు లాంటి చోట్ల కలెక్షన్లు బావున్నా కానీ, దీనికి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. బాక్సాఫీస్ వద్ద ఆశించిన హుషారు కనిపించలేదని ట్రేడ్ చెబుతోంది. నిజానికి సుదీప్.. తన సినిమాలో అతిథి పాత్రల కోసం పొరుగు భాషా హీరోలను సంప్రదించినా ముందుకు రాలేదని కూడా తెలుస్తోంది. తన అభ్యర్థనను మన్నించని వారి కోసమేనా తాను ఇన్నాళ్లు ఇలా సహకరించాను అని అతడు ఆవేదన చెందాడని గుసగుస వినిపిస్తోంది.
పైరసీపైనా ధ్వజం:
కిచ్చా సుదీప్ `మార్క్` విడుదలకు ముందే పైరసీ - ఆన్‌లైన్ ట్రోల్స్‌పై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సోషల్ మీడియా సహా శాండల్‌వుడ్ లో పెద్ద చర్చకు దారితీసింది. నిజ జీవితంలో ప్రశాంతంగా కనిపించే సుదీప్ ఈ స్థాయిలో విరుచుకుపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే సుదీప్ ఇలా సీరియస్ అవ్వడానికి కారణం లేకపోలేదు 2019లో అతడు నటించిన `పైల్వాన్` విడుదల రోజున పైరసీతో తీవ్ర సమస్యలను ఎదుర్కొంది. పైరసీ మాఫియా పూర్తి సినిమాను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. లింక్‌లను షేర్ చేసారు. అయితే దీనిపై సైబర్ క్రైమ్ ని సంప్రదించా పోలీసులు నిందితులను అరెస్ట్ చేసారు. కానీ అప్పటికే చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. నిర్మాతలు ఆర్థిక నష్టాలను చవిచూశారు. ఈ సంఘటన సుదీప్‌పై శాశ్వత ముద్ర వేసింది. మార్క్‌ను లక్ష్యంగా చేసుకుని నకిలీ పోస్ట్‌లు పెట్టేవారిపైనా, ఆన్‌లైన్ లో తప్పుడు సమాచారం అందించే వారిపైనా సుదీప్ కన్నేసి ఉంచారు. తన వ్యతిరేక అభిమానుల సంఘాల ద్వారా తప్పుదారి పట్టించే పోస్ట్‌లపైనా అతడు దృష్టి సారించి పోలీసులకు చెప్పారు.
అంతేకాదు.. ఇండస్ట్రీలో కొందరు వ్యక్తులు తన గత చిత్రాల ప్రమోషన్ల సమయంలో తారాగణం, సిబ్బంది, కథాంశం గురించి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసారని కూడా సుదీప్ ఆరోపించారు. ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో పైరసీ మరియు తక్కువ రేటింగ్‌లను కూడా బెదిరించాయి. సుదీప్ మార్క్ కోసం ఇలాంటి ప్రణాళికల గురించి తెలుసుకున్నట్లు సమాచారం. దీనివల్ల అతడు తప్పుడు కార్యకలాపాలకు వ్యతిరేకంగా బహిరంగంగా జాగ్రత్త వహిస్తున్నాడు. రిలీజ్ డే ప్రతికూల వ్యాఖ్యలు, ట్రోల్స్ రాకుండా సుదీప్ జాగ్రత్తపడ్డాడని కూడా కథనాలొస్తున్నాయి. కొందరు అనవసరమైన వివాదాన్ని సృష్టించడానికి, తన సినిమా ప్రతిష్టకు హాని కలిగించడానికి సినిమా చూడకుండానే, సోషల్ మీడియాలో ప్రతికూల వ్యాఖ్యలను పోస్ట్ చేస్తారని కూడా సుదీప్ ఆరోపించారు.