కియారా బికినీ సీన్స్ కోసం డిమాండ్స్.. మేకర్స్ ఏం చేస్తారో?

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.;

Update: 2025-08-11 10:17 GMT

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ బికినీ సీన్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఆమె ఫిమేల్ లీడ్ రోల్ లో నటించిన వార్ -2 మూవీ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. బీ టౌన్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. YRF స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న మూవీ.. ఆగస్టు 14వ తేదీన విడుదల కానుంది. వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవ్వనుంది.

అయితే సినిమాలో కియారా బికినీలో సందడి చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ విషయాన్ని మచ్చు చూపించారు మేకర్స్. దీంతో ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యూత్ ను తెగ ఆకట్టుకున్నాయి. నెవర్ బిఫోర్ అనేలా అమ్మడు బికినీలో ఉందని అంతా కొనియాడారు. ఎంతో మంది బ్యూటీలు బికినీలో కనపడినా... కియారా మాత్రం సూపర్ అని తెలిపారు.

సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కియారా బికినీ సీన్స్ అయినా చూడడానికి మూవీకి వెళ్లాలని కొందరు ఫిక్స్ అయినట్లు ఇప్పటికే టాక్ వచ్చింది. అయితే వారికి సెన్సార్ బోర్డు చిన్నపాటి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఓ సాంగ్ లో కియారా బికినీలో కనపడనుండగా.. కొన్ని సెన్సువల్ విజువల్స్ ను కట్ చేయాలని సెన్సార్ బోర్డు అధికారులు ఆదేశించినట్లు తెలిసింది.

సగానికి సగం విజువల్స్ ను కట్ చేయమన్నారని.. దీంతో మేకర్స్ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. తొమ్మిది సెకన్ల బికినీ సన్నివేశాన్ని తగ్గించినట్లు వినికిడి. దీంతో కియారా ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తాము వెయిట్ చేస్తున్న విజువల్స్ ను కట్ చేస్తే ఎలా అని క్వశ్చన్ చేస్తున్నారు.

అదే సమయంలో ఆ తొమ్మిది సెకన్ల క్లిప్ ను మేకర్స్.. అఫిషియల్ అకౌంట్ ద్వారా యుట్యూబ్ లో అప్లోడ్ చేయాలని కోరుతున్నారు. తమ డిమాండ్ ను తప్పక నెరవేర్చాలని చెబుతున్నారు. సినిమా విడుదలకు ముందు 9 సెకన్ల సెన్సార్ చేసిన క్లిప్ ను పోస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి వార్ 2 నిర్మాతలు ఆ డిమాండ్‌ కు తలొగ్గుతారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News