పాత‌ వీడియోతో ఖుషి క‌పూర్ పై ట్రోల్స్

సోష‌ల్ మీడియా విప‌రీతంగా పెరిగిన నేప‌థ్యంలో ఎప్పుడే వీడియో వైర‌ల్ అవుతుందో ఎవ‌రికీ తెలియ‌డం లేదు.;

Update: 2025-07-29 10:30 GMT

సోష‌ల్ మీడియా విప‌రీతంగా పెరిగిన నేప‌థ్యంలో ఎప్పుడే వీడియో వైర‌ల్ అవుతుందో ఎవ‌రికీ తెలియ‌డం లేదు. ఎవ‌రో ఎప్పుడో ఏదో సంద‌ర్భంలో చెప్పిన మాట‌లు కూడా బ‌య‌ట‌కు లాగి వారికి న‌చ్చిన‌ప్పుడు దాన్ని వైర‌ల్ చేయ‌డంలో నెటిజ‌న్లు బాగా ఆరితేరారు. ఇప్పుడు అతిలోక సుంద‌రి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి క‌పూర్ కు చెందిన ఓ వీడియో క్లిప్ కూడా అలానే వైర‌ల్ అవుతుంది.

సైయారాతో అహాన్ కు మంచి హిట్

అయితే ఖుషి క‌పూర్ గ‌తంలో మాట్లాడిన మాట‌లు ఇప్పుడు వైర‌ల్ అవ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. దానికి కార‌ణంగా సైయారా సినిమా స‌క్సెస్. మోహిత్ సూరి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాతో అహాన్ పాండే మంచి స‌క్సెస్ ను అందుకున్నారు. య‌ష్ రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ నిర్మించిన ఈ సినిమాలో అనీత్ ప‌డ్డా హీరోయిన్ గా ప‌రిచ‌య‌మ‌య్యారు. సైయారాతో అనీత్ ప‌ద్దాకు కూడా మంచి మార్కులొచ్చాయి.

నెట్టింట ఖుషి పాత వీడియో

సైయారా సినిమా హిట్టైన నేప‌థ్యంలో ఇప్పుడు ఎక్కువ‌గా అహాన్ వార్త‌ల్లో నిలుస్తున్నారు. అందులో భాగంగానే ఖుషి గ‌తంలో తాను అహాన్ స‌ర‌స‌న న‌టిస్తూ అరంగేట్రం చేయాల‌నుకుంటున్న‌ట్టు మాట్లాడిన వీడియో ఒక‌టి ఆన్ లైన్ లో వైర‌ల్ అవుతుంది. 2019లో ఖుషి క‌పూర్ త‌న అక్క జాన్వీ క‌పూర్ తో క‌లిసి నేహా ధూపియా టాక్ షో లో పాల్గొన్నారు.

అహాన్ తో డెబ్యూ చేయాల‌నుంది

ఆ షో లో భాగంగా మొద‌టి సినిమా కోసం ఆర్య‌న్ ఖాన్, అహాన్ పాండే, మీజాన్ జాఫేరి ల‌లో ఎవ‌రితో జత క‌ట్టాల‌నుకుంటున్నార‌ని అడ‌గ్గా దానికి ఖుషి క‌పూర్ అహాన్ పాండే ను సెలెక్ట్ చేసుకున్నారు. కానీ జాన్వీ మాత్రం మీజాన్ ప‌క్క‌న అయితే ఖుషి బావుంటుంద‌ని చెప్పారు. కాగా త‌ర్వాత ఖుషీ క‌పూర్ ది ఆర్చీస్ సినిమాతో డెబ్యూ చేయ‌గా, అహాన్ పాండే సైయారాతో చాలా పెద్ద హిట్ అందుకున్నారు.

ఖుషిపై ట్రోలింగ్

ఇద్ద‌రు త‌మ త‌మ కెరీర్లో బిజీగా ఉన్న టైమ్ లో ఇప్పుడీ వీడియో ఆన్ లైన్ లోకి రావ‌డంతో నెటిజ‌న్లు దానిపై త‌మ అభిప్రాయ‌ల‌ను షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఖుషి క‌పూర్ సైయారాను చేసి ఉంటే ఆ సినిమా ఫ్లాప‌య్యేది ఒక‌రంటుంటే, దేవుని ద‌య వ‌ల్ల ఖుషి ఈ సినిమాకు వ‌ర్క్ చేయ‌లేద‌ని కామెంట్స్ చేస్తున్నారు. మ‌రికొంద‌రు సైయారా హిట్ అయినందుకు అనీత్ ను ప్ర‌శంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇంత జ‌రుగుతున్నా ఈ విష‌యంపై అటు అహాన్ పాండే కానీ, ఇటు ఖుషి క‌పూర్ కానీ ఎవ‌రూ రెస్పాండ్ అవ‌లేదు. వారిద్ద‌రూ త‌మ త‌మ నెక్ట్స్ ప్రాజెక్టులను ఫిక్స్ చేసుకోవ‌డంలో బిజీగా ఉన్నారు.

Tags:    

Similar News