ఖుష్బూ 40 ఏళ్ల సక్సెస్ ఫార్ములా.. కొత్త హీరోయిన్లు తప్పక తెలుసుకోవాల్సిందే!

సినీ ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల కెరీర్‌కు ఒక నిర్దిష్ట గడువు ఉంటుందనే అభిప్రాయం చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది.

Update: 2026-08-14 11:30 GMT

సినీ ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల కెరీర్‌కు ఒక నిర్దిష్ట గడువు ఉంటుందనే అభిప్రాయం చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. కానీ ఆ భావనను తన నాలుగు దశాబ్దాల ప్రయాణంతో సవాల్ చేసిన హీరోయిన్ల‌లో ఖుష్బూ సుందర్ పేరు ముందువరుసలో నిలుస్తుంది. 1986లో కలియుగ పాండవులు సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె, నేటితో 40 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ఎమోషనల్ పోస్ట్ త‌న కెరీర్ లాంగెవిటీని మరోసారి గుర్తు చేసింది.

15 ఏళ్ల వయసులో సౌత్ గురించి ఏమీ తెలియకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఖుష్బూ, కేవలం స్టార్ హీరోయిన్‌గా మాత్రమే కాకుండా కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ నిలబడిన నటిగా గుర్తింపు పొందారు. తెలుగు, తమిళ భాషల్లో అగ్రహీరోల సరసన హీరోయిన్‌గా మెరిసిన ఆమె, తర్వాతి దశలో క్యారెక్టర్ రోల్స్, టెలివిజన్, పబ్లిక్ లైఫ్ వంటి విభిన్న రంగాల్లో తన స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

సినీ రంగంలో నిలబడటానికి టాలెంట్ ఒక్కటే సరిపోదు.. క్రమశిక్షణ, సంబంధాలను కాపాడుకోవడం, కొత్త పరిస్థితులకు తగ్గట్టుగా మారడం కూడా అంతే ముఖ్యమని ఖుష్బూ ప్రయాణం చెబుతోంది. భాషను నేర్చుకోవడం నుంచి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తన ఇమేజ్‌ను మార్చుకోవడం వరకు ఆమె తీసుకున్న డెసిష‌న్స్, కొత్త తరానికి కూడా ఒక పాఠంలా నిలుస్తాయి.

ఈ 40 ఏళ్ల ప్రయాణంలో మరో ప్రత్యేకమైన అంశం వెంకటేశ్‌తో ఆమెకు ఉన్న స్నేహం. కలియుగ పాండవులుతో ప్రారంభమైన పరిచయం, నేటికీ కొనసాగుతున్న లైఫ్ టైమ్ బాండింగ్ గా మారిందని ఖుష్బూ తన పోస్టులో పేర్కొన్నారు. స్టార్‌డమ్, కెరీర్ మార్పులు, ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో వచ్చిన ఎన్నో పరిణామాల మధ్య కూడా ఆ స్నేహాన్ని ఆమె ప్రత్యేకంగా గుర్తు చేయడం ఇండస్ట్రీలో సంబంధాల విలువను చాటుతోంది.

ఖుష్బూ చేసిన పోస్ట్‌లో కృతజ్ఞత ప్రధాన భావంగా కనిపించింది. తనకు అవకాశం ఇచ్చిన రామానాయుడు, రాఘవేంద్రరావు, సురేశ్ బాబుతో పాటు ఫ్యాన్స్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపిన తీరు, స‌క్సెస్ ను సాధించిన తర్వాత మూలాలను మర్చిపోకూడదనే సందేశాన్ని ఇస్తోంది. మారుతున్న తరాలు, మారుతున్న సినిమా ధోరణులు, మారుతున్న పాత్రల మధ్య హీరోయిన్‌గా మొద‌లైన‌ ప్రయాణం లాంగెవిటీతో చరిత్రగా మారాలంటే టాలెంట్ తో పాటు మార్పును స్వీకరించే ధైర్యం, సంబంధాలను నిలబెట్టుకునే మనస్తత్వం కూడా అంతే అవసరమ‌ని 40 ఏళ్లు న‌టిగా కొన‌సాగిన ఖుష్బూ కెరీర్ స్ప‌ష్టంగా చెబుతోంది.

Tags:    

Similar News