మ‌మితా-క‌యాదు మ‌ధ్య‌లో కేతిక త‌న్నుకుపోయిందా?

ఒక హీరోయిన్ అవ‌కాశం మ‌రో హీరోయిన్ త‌న్నుకుపోవ‌డం స‌హ‌జ‌మే. కొన్నిసార్లు హీరోయిన్ల అల‌స‌త్వం కార‌ణ‌మైతే మ‌రికొన్ని సార్లు మేక‌ర్ల నిర్ణ‌యాల కార‌ణంగా రాత్రికి రాత్రే హీరోయిన్లు మారిపోతుంటారు.;

Update: 2025-05-26 09:30 GMT

ఒక హీరోయిన్ అవ‌కాశం మ‌రో హీరోయిన్ త‌న్నుకుపోవ‌డం స‌హ‌జ‌మే. కొన్నిసార్లు హీరోయిన్ల అల‌స‌త్వం కార‌ణ‌మైతే మ‌రికొన్ని సార్లు మేక‌ర్ల నిర్ణ‌యాల కార‌ణంగా రాత్రికి రాత్రే హీరోయిన్లు మారిపోతుంటారు. తాజాగా ర‌వితేజ కొత్త చిత్రం విష‌యంలో అదే జ‌రిగిన‌ట్లు క‌నిపిస్తుంది. ర‌వితేజ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల ఓ సినిమాకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే స్టోరీ లాక్ అయింది. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగు తున్నాయి.

ఇందులో ఇద్ద‌రు నాయిక‌ల‌కు అవ‌కాశం ఉండ‌గా? వాటి కోసం క‌య‌దా లోహార్, మ‌మితా బైజుల‌ను ప‌రిశీలిస్తున్నారు. వాళ్ల‌తో టీమ్ డిస్క‌ష‌న్స్ కూడా షురూ చేసింది. వాళ్లిద్ద‌రిలో ఒక‌రు మెయిన్ లీడ్ కి..మ‌రొక‌రు సెకెండ్ లీడ్ కి ఎంపిక అవ్వాల్సి ఉంది. అయితే ఇప్పుడా ఇద్ద‌రి మ‌ధ్య‌లో  మెయిన్ లీడ్ ఛాన్స్ కేతిక శ‌ర్మ త‌న్నుకుపోయింది. మేక‌ర్స్ అమెను ఫైన‌ల్ చేసిన‌ట్లు స‌న్నిహితుల నుంచి తెలిసింది.

కేతిక‌తో అన్ని రకాల అగ్రిమెంట్లు చేసుకున్న‌ట్లు స‌మాచారం. జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా మొద‌లవుతుంద‌ని తెలిసింది. వాస్త‌వానికి కేతిక పేరు ఈ ప్రాజెక్ట్ ప్ర‌చారంలోనే లేదు. తొలి నుంచి కయాదు లోహ‌ర్, మ‌మితా బైజు పేర్లే బ‌లంగా వినిపించాయి. కానీ ఈ సన్నివేశం రాత్రికి రాత్రే మారిపోయింది. కేతిక పేరు ప‌రిశీల‌న‌లోకి రాగానే అమ్మ‌డు చ‌క్రం తిప్ప ప్రాజెక్ట్ చేజిక్కుచుకుంది.

దీనికి సంబంధించి మేక‌ర్స్ నుంచి అధికారికంగా వెల్ల‌డి కావాల్సి ఉంది. ఇటీవ‌లే కేతిక శ‌ర్మ 'సింగిల్' సినిమాతో మంచి విజ‌యం అందుకుంది. 'రొమాంటిక్' సినిమాతో కేతిక టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అటుపై కొన్ని సినిమాలు చేసినా క‌లిసి రాలేదు.'సింగిల్' తో మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. ఆ క్రేజ్ తోనే ఛాన్స్ అందుకుంది.

Tags:    

Similar News