నింగిలో తార‌క‌లు భూమిపై కీర్తి ముందు వెల‌వెల‌

ప్ర‌స్తుతం మాల్దీవుల్లో విహార‌యాత్ర‌లో ఉన్న కీర్తి కొన్ని ఫోటోల‌ను ఇన్ స్టాలో షేర్ చేస్తోంది.;

Update: 2025-05-26 17:40 GMT

ఆకాశం నిండుగా చుక్క‌లు ప్ర‌కాశిస్తున్నాయి.. కానీ చంద‌మామ మాత్రం భూమ్మీదికి చేరుకుంది దేనికో! ఈ అందాల‌ చంద్రిక‌ ఎవ‌రో ప్ర‌త్యేకంగా ప‌రిచయం చేయాలా? మ‌హాన‌టిగా గ్లోబ‌ల్ వైడ్ ప్ర‌జ‌ల అభిమానం చూర‌గొన్న ఈ అందాల చంద‌మామ కీర్తి సురేష్.

 

నింగిలో చుక్క‌లు ఎంత ప్ర‌కాశించినా, ఇక్క‌డ అభిన‌య‌నేత్రిగా కీర్తి ప్ర‌కాశం ముందు వెల‌వెల‌బోవాల్సిందే. కీర్తి అందం విశ్వ‌విఖ్యాత‌మైంది. ఒక క‌ళాకారిణిగా మ‌హాన‌టి ప్ర‌కాశం అనంత‌మైన‌ది. అందుకేగా, ఆయిల్ దేశంలోని విలాసాల్లో నివ‌శించే కుర్రాడినే కొంగున క‌ట్టేసుకుంది. పెళ్లి త‌ర్వాతా న‌టిగా కెరీర్ ని విజ‌య‌వంతంగా ముందుకు సాగిస్తున్న ఈ అందాల కీర్తి వ్య‌క్తిగ‌త జీవితానికి ఎలాంటి లోటు లేకుండా ప్ర‌ణాళికా బ‌ద్ధంగా ముందుకు సాగుతోంది.

కీర్తి త‌న స్కూల్ కాలేజ్ ఫ్రెండునే పెళ్లాడింది గ‌నుక, లైఫ్ లో మ‌జాను అద‌నంగా ఆస్వాధిస్తోంది. ప్ర‌స్తుతం మాల్దీవుల్లో విహార‌యాత్ర‌లో ఉన్న కీర్తి కొన్ని ఫోటోల‌ను ఇన్ స్టాలో షేర్ చేస్తోంది. వీటిలో రొమాంటిక్ మూడ్ లో ఉన్న ఓ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేయ‌గా అది కుర్ర‌కారు హృద‌యాల‌ను కిల్ చేస్తోంది.

ఆకాశంలో చుక్క‌లు ప్ర‌కాశిస్తున్నాయి. భూమ్మీద చంద్రిక వెలుగులు పంచుతోంది! కీర్తి దివ్య‌మైన రూపం స‌మ్మోహ‌నంలో ముంచేస్తోంది. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. కీర్తి ప్ర‌స్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. త‌మిళం, మ‌ల‌యాళంలోను న‌టిస్తోంది. హిందీలోను మ‌రో రెండు చిత్రాల‌కు సంత‌కాలు చేయ‌నుంద‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి. కెరీర్ కెరీరే.. వ్య‌క్తిగ‌త జీవితంలో మ‌జా మ‌జానే! కీర్తిని చూశాక‌, ఇత‌ర పెళ్లీడుకొచ్చిన‌ క‌థానాయిక‌లు దీనిని అంగీక‌రించి తీరాలి.

Tags:    

Similar News