కీర్తికి స‌క్సెస్ ద‌క్కేదెప్పుడు?

సౌత్ ఇండియ‌న్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ మ‌ధ్య వ‌రుస ఫ్లాపుల‌ను ఎదుర్కొంటుంది.;

Update: 2025-11-29 10:30 GMT

సౌత్ ఇండియ‌న్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఈ మ‌ధ్య వ‌రుస ఫ్లాపుల‌ను ఎదుర్కొంటుంది. గ‌త కొన్నాళ్లుగా కీర్తి నుంచి వ‌చ్చిన ఏ సినిమాలూ తెలుగులో పెద్ద‌గా ఆడ‌టం లేదు. రీసెంట్ గా కీర్తి న‌టించిన రివాల్వ‌ర్ రీటా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మంచి అంచ‌నాల‌తో రిలీజైన రివాల్వ‌ర్ రీటా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితాన్ని అందుకోలేక పోయింది.

ఫ‌లితం లేకుండా పోయిన కీర్తి ప్ర‌మోష‌న్స్

స్వ‌యంగా కీర్తి సురేష్ ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ లో పాల్గొని సినిమాను ప్ర‌మోట్ చేసిన‌ప్ప‌టికీ అది కూడా ఏ మాత్రం మెరుగైన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేక‌పోయింది. ఇంకా చెప్పాలంటే చాలా మందికి అస‌లు ఆ సినిమా ఒక‌టి రిలీజైంది అని కూడా తెలియ‌దు. దానికి తోడు సినిమాలో కంటెంట్ కూడా పెద్ద‌గా క్లిక్ అవ‌క‌పోవ‌డంతో రివాల్వ‌ర్ రీటా మొద‌టి రోజే డిజాస్ట‌ర్ గా నిలిచింది.

కీర్తి ఖాతాలో మ‌రో ఫ్లాపు

రివాల్వ‌ర్ రీటా రిజ‌ల్ట్ తో కీర్తి మ‌రోసారి త‌న ఖాతాలో ఫ్లాపును వేసుకుంది. దీంతో కీర్తి త‌న‌కు స‌క్సెస్ ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూస్తోంది. మొన్నామ‌ధ్య కీర్తి తెలుగులో చేసిన ఉప్పు క‌ప్పురంబు సినిమా కూడా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజవ‌గా, అది కూడా అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. ఇక ర‌ఘతాత మూవీ కూడా అంతే, సినిమా కూడా ఆడియ‌న్స్ ను మెప్పించ‌లేక‌పోయింది.

కాగా కీర్తి భోళాశంక‌ర్ త‌ర్వాత తెలుగులో డైరెక్ట్ సినిమాలు చేసింది లేదు. పెళ్లి త‌ర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న కీర్తి సురేష్ ఇప్పుడా గ్యాప్ ను పూరించాల‌ని వ‌రుస సినిమాల‌ను లైన్ లో పెట్టి అందులో భాగంగానే రివాల్వ‌ర్ రీటాను ఆడియ‌న్స్ ముందుకు తీసుకొస్తే, అది కాస్తా ఫ్లాపుగా నిలిచింది. ప్ర‌స్తుతం కీర్తి విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న దిల్ రాజు బ్యాన‌ర్ లో ఓ సినిమాను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి ఈ సినిమా అయినా కీర్తికి మంచి స‌క్సెస్ ను అందిస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News