రౌడీ జ‌నార్ద‌న్ లో రౌడీ రాణిలా!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా ర‌వి కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో `రౌడీ జ‌నార్ద‌న్` రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-10-21 17:30 GMT

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా ర‌వి కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో `రౌడీ జ‌నార్ద‌న్` రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. టైటిల్ కి త‌గ్గ‌ట్టే విజ‌య్ రోల్ సినిమాలో ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. భారీ మాస్ ట‌చ్ ఇస్తూ ఆ పాత్ర‌ను డిజైన్ చేసిన‌ట్లు వినిపిస్తోంది. సెట్స్ నుంచి ఏవైనా లీక్స్ వ‌స్తే పాత్ర‌కు సంబంధించి మ‌రింత అప్ డేట్ తెలిసే అవ‌కాశం ఉంటుంది. మ‌రి హీరోయిన్ సంగ‌తేంటి? అంటే హీరోయిన్ గా ఇప్ప‌టికే కీర్తి సురేష్ ఫిక్సైంది. అయితే ఆమె పాత్ర ఎలా ఉంటుంద‌న్న‌ది బ‌య‌ట‌కు రాలేదు. ఈ నేప‌థ్యంలో చిత్ర వ‌ర్గాల నుంచి ఆ పాత్ర కూడా అంతే మాస్ గా ఉంటుంద‌నే లీక్ అందింది.

కళావ‌తి కోరిక తీరేలా:

జ‌నార్ద‌న్ రౌడీ అయితే ? కీర్తి సురేష్ రోల్ రౌడీ రాణిలా ఉంటుందంటున్నారు. కీర్తి సురేష్ మునుపెన్న‌డు పోషించ‌ని ఓ డిఫ‌రెంట్ పాత్ర‌గా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో నిజాలు తేలాల్సి ఉంది. కీర్తి సురేష్ ఇంత వ‌ర‌కూ మాస్ పాత్ర‌లు పోషించింది లేదు. క్లాసిక్ రోల్స్ లో మాత్ర‌మే క‌నిపించింది. కానీ ఆప్ ది స్క్రీన్ లో కీర్తి సురేష్ మాస్ డైలాగ్ ల‌తో త‌న‌లో ఆ ర‌క‌మైన ఫ్యాష‌న్ ని బ‌య‌ట పెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. తెర‌పై అలా క‌నిపించాలి...ఇలా క‌నిపించాలి? అన్న సంద‌ర్భంలో రౌడీ రాణిలా కూడా క‌నిపించాల‌ని ఉంద‌ని ఓ సారి ఓపెన్ అయింది.

కీర్తి ఇమేజ్ మారేలా:

`రౌడీ జ‌నార్ద‌న్` లో అదే త‌ర‌హా రోల్ అయితే అమ్మ‌డి కోరిక తీరిన‌ట్లే. ఆ వివ‌రాలు తెలియాలంటే మ‌రింత స‌మ‌యం ప‌డుతుంది. ఇటీవ‌లే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం కోలీవుడ్ లో `రివాల్వ‌ర్ రీటా` అనే లేడీ ఓరియేంటెడ్ చిత్రంలో న‌టిస్తోంది. ఇందులోనూ అమ్మడి పాత్ర మాస్ గా ఉంటుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌థ అంతా ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. కాబ‌ట్టి ఆ పాత్ర ఆద్యంత ఆస‌క్తిక‌రంగా మ‌లుస్తారు. ఈ రెండు చిత్రాల రిలీజ్ త‌ర్వాత కీర్తిపై ఉండే ఇమేజ్ కోణం కూడా మారుతుందేమో. కీర్తి సురేష్ అంటే ఇప్ప‌టి వ‌ర‌కూ క్లాసిక్ హీరోయిన్ గానే చూస్తున్నారు.

భారీ స‌క్స‌స్ అనివార్య‌మే:

క్లాస్ రోల్స్..రొమాంటిక్ పాత్ర‌ల‌తోనే ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. అలాంటి న‌టిలో మాస్ కోణాన్ని త‌ట్టి లేపేఓ ప్రయ‌త్నం జ‌రుగుతుంది. మ‌రేం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి. ఈ బ్యూటీకి స‌క్సెస్ అనివార్య‌మైన స‌మ‌య‌మే. సినిమాలు చేస్తున్నా? ఫ‌లితాలు ఆశించిన విధంగా రావ‌డం లేదు. ల‌క్కీగా అవ‌కాశాలైతే అందుకుంటుంది గానీ భారీ స‌క్సస్ లు అందుకోవ‌డంలో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ వెనుక‌బ‌డే ఉంది. అమ్మ‌డి కెరీర్ మొత్తం చెఎక్ చేస్తే `మ‌హాన‌టి` త‌ప్ప మ‌రే సినిమా క‌నిపించ‌డం లేదు. అదే ఇమేజ్ తో ఇప్ప‌టికీ ఛాన్సులందుకుంటుంది.

Tags:    

Similar News