లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు.. కంటెంట్ ముఖ్యం కీర్తి!
నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. ఇప్పుడు రివాల్వర్ రీటా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.;
నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. ఇప్పుడు రివాల్వర్ రీటా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. చంద్రు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. లేడీ ఓరియెంటెడ్ జోనర్ లో రూపొందుతున్న ఆ మూవీ.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల అవ్వనుంది.
అయితే లేడీ ఓరియెంటెడ్ జోనర్ పై కీర్తి సురేష్ రీసెంట్ గా చేసిన కామెంట్స్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆడియన్స్ కు లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఇంట్రెస్ట్ లేదని వ్యాఖ్యానించారు. అలాంటి చిత్రాలకు ప్రజాదరణ కూడా లేదని అన్నారు. ఆ తర్వాత తమ ఫేవరెట్ హీరోయిన్ మూవీ అయినా ఆసక్తి చూపించరని అన్నారు.
ఆ రోజు అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే మాత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారని అభిప్రాయపడ్డారు. సినీ ప్రియులు ఇప్పుడు అలా చేంజ్ అయ్యారని అనడంతో నెట్టింట అది చర్చనీయాంశంగా మారింది. దీంతో అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు స్పందిస్తున్నారు. కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ పై తమ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను కూడా అంతా చూస్తారని.. కానీ కంటెంట్ ముఖ్యమని చెబుతున్నారు. కంటెంట్ బాగుంటే.. కచ్చితంగా మంచి హిట్స్ గా నిలుస్తాయని అంటున్నారు. ఇప్పటికే హిట్స్ గా నిలిచిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలను గుర్తు చేస్తున్నారు. స్టార్ హీరోల చిత్రాలపై ఆధిపత్యం చెలాయించిన సినిమాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
సీనియర్ హీరోయిన్ అనుష్క నటించిన అరుంధతి మూవీ.. 2009లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్లకు పైగా సాధించింది. ఆ తర్వాత ఇటీవల శ్రద్ధా కపూర్ యాక్ట్ చేసిన స్త్రీ 2 సినిమా.. భారీ వసూళ్లను రాబట్టింది. దాదాపు రూ.800 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అతి పెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచింది.
రీసెంట్ గా కళ్యాణి ప్రియదర్శన్.. నటించిన లోకా మూవీ అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం సినిమాగా నిలిచింది. ఇవన్నీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అయినా సూపర్ హిట్స్ అయ్యాయి. అందుకు ముఖ్య కారణం కంటెంటే. అది ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంటే.. ఎంత పోటీ ఉన్నా హిట్ గా నిలవడం ఖాయం. అయితే కీర్తి కామెంట్స్ లో కొన్ని మాత్రం నిజమే అయినా.. కంటెంట్ ఉంటే ఏదైనా సాధ్యమనే చెప్పాలి.