చిరు-బాబీ సినిమా నిర్మాతకు కాస్త ఊరట

గత కొన్ని నెలలుగా కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ పేరు సోషల్ మీడియాలో ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే.;

Update: 2026-05-01 05:59 GMT

గత కొన్ని నెలలుగా కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ పేరు సోషల్ మీడియాలో ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. కానీ ఆ సంస్థ పేరు పాజిటివ్ విషయాల్లో చర్చనీయాంశం కావడం లేదు. అన్నీ నెగెటివ్ విషయాలతోనే కేవీఎన్ వార్తల్లోకి వస్తోంది. ఆ సంస్థ ప్రొడ్యూస్ చేసిన ‘జననాయగన్’ సెన్సార్ చిక్కుల్లో పడి విడుదలకు నోచుకోకుండా ఆగిపోవడం.. మొత్తం సినిమా విడుదలకు ముందే ఆన్ లైన్లో లీక్ అయిపోవడం మీద ఎంత డిస్కషన్ నడిచిందో తెలిసిందే. దీని వల్ల నిర్మాతకు భారీ నష్టమే వాటిల్లింది. మరోవైపు చిరంజీవి, బాబీ సినిమా అనుకున్న సమయానికి మొదలు కాకపోవడం మీదా అందరూ నెగెటివ్‌గానే మాట్లాడుకున్నారు. ఇంకోవైపు కేవీఎన్ ప్రొడ్యూస్ చేసిన ‘కేడీ: ది డెవిల్’ సినిమా పాట మీద ఆ మధ్య తీవ్ర దుమారం రేగింది. ఇలా ఎటు చూసినా ఈ సంస్థకు తలనొప్పులే కనిపించాయి. ఇలా నెలల తరబడి నెగెటివ్ విషయాలతో సతమతం అయిన కేవీఎన్ సంస్థకు ఎట్టకేలకు ఊరట లభించింది.

కేవీఎన్ నిర్మాణంలో తెరకెక్కిన ‘కేడీ: ది డెవిల్’ ఈ గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి కన్నడలో మంచి టాక్ వచ్చింది. రివ్యూలు పాజిటివ్‌గా ఉన్నాయి. మౌత్ టాక్ కూడా బాగుంది. క్రిటిక్స్ ఆహా ఓహో అనకపోయినా.. సినిమా గురించి సానుకూలంగా స్పందించారు. ఇది ధ్రువ్ సర్జా హీరోగా నటించిన చిత్రం. అతడి సినిమాలన్నీ చాలా వరకు మాస్ మసాలాలే. మరీ శ్రుతి మించిపోయే మాస్, యాక్షన్ అంశాలుండే తన చిత్రాలకు సాధారణంగా అంత మంచి రివ్యూలు రావు. కానీ ‘కేడీ’ మాత్రం పాజిటివ్ రివ్యూలు తెచ్చుకుంది. ఎలివేషన్లు, యాక్షన్ ఘట్టాలు అదిరిపోయాయని.. కథ కూడా బాగుందని టాక్ వచ్చింది. ఈ చిత్రాన్ని రూపొందించింది ‘ఇడియట్’ ఫేమ్ రక్షిత భర్త ప్రేమ్ కావడం విశేషం. చాలా ఏళ్ల తర్వాత తనకు కూడా హిట్ పడ్డట్లే కనిపిస్తోంది. ఇందులో కిచ్చా సుదీప్ క్యామియోకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. థియేటర్ సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. ‘కేడీ’ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. ఇతర భాషల వెర్షన్లకు సెన్సార్ పూర్తి కాకపోవడంతో వారం

ఆలస్యంగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. వరుస ఎదురు దెబ్బల తర్వాత కేవీఎన్ సంస్థకు ఈ చిత్రం గొప్ప ఉపశమనాన్నిస్తోంది.

Tags:    

Similar News