• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రూ.7 కోట్ల ప్రశ్నకు...

రూ.7 కోట్ల ప్రశ్నకు సమాధానం తెలిసినా క్విట్.. భూషణ్‌కు ఏమైంది?

| కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 18లో మహారాష్ట్రకు చెందిన భూషణ్ ఠాకరే కోటి రూపాయలు గెలుచుకున్నాడు. రూ.7 కోట్ల చివరి ప్రశ్నకు సమాధానం తెలిసినా, తప్పు అయితే కోటి మొత్తం రూ.3.2 లక్షలకు తగ్గిపోతుందనే భయంతో ఆట నుంచి తప్పుకున్నాడు. తల్లి అమ్మిన నగలను తిరిగి కొనివ్వాలనే కోరికతో రిస్క్ తీసుకోలేదని వెల్లడించాడు.

By - Madhu Reddy
Update: 2026-11-26 08:43 GMT

కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) సీజన్ 18లో ఒక సామాన్యుడి కథ ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. అకౌంట్‌లో కేవలం 24 రూపాయలతో ముంబై వెళ్లిన భూషణ్ ఠాకరే, ఏకంగా కోటి రూపాయలు గెలిచి చరిత్ర సృష్టించాడు. అయితే అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. రూ.7 కోట్ల చివరి ప్రశ్నకు సరైన సమాధానం తెలిసి కూడా అతను ఆట నుంచి తప్పుకున్నాడు. ఎందుకు అంత పెద్ద మొత్తాన్ని వదులుకున్నాడో తెలిస్తే ఎవరైనా శభాష్ అనాల్సిందే. ఆ వివరాలు చూద్దాం..

తెలిసి కూడా తప్పుకోవడం వెనుక అసలు కారణం:

'బ్రిటిష్ ఇండియాలోని భాషలపై గ్రియర్సన్ ఏ నగరం నుంచి సర్వే చేపట్టారు?' అనే 7 కోట్ల ప్రశ్నకు భూషణ్ 'క్యాంబర్లీ' అని సరిగ్గానే ఊహించాడు. కానీ ఆట నుంచి క్విట్ అయ్యాక ఆ సమాధానం చెప్పడంతో అమితాబ్ బచ్చన్ సైతం ఆశ్చర్యపోయారు. ఇక ఒకవేళ ఆ సమాధానం తప్పు అయితే, రూల్స్ ప్రకారం గెలిచిన కోటి రూపాయలు కాస్తా 3 లక్షల 20 వేలకు పడిపోతాయి. తనకు ఎక్కువ నమ్మకం లేని విషయంలో రిస్క్ తీసుకోవడం కంటే, చేతిలో ఉన్న కోటి రూపాయలను కాపాడుకోవడమే అతనికి ముఖ్యమనిపించింది.

35 ఏళ్ల కష్టం.. అమ్మ నగల త్యాగం;

మహారాష్ట్రకు చెందిన భూషణ్ తండ్రి ఒక రోజువారీ కూలీ. ఆయనకు నెలంతా పని దొరికితేనే 15 నుంచి 20 వేలు వస్తాయి. అంటే ఇప్పుడు గెలిచిన కోటి రూపాయలు వాళ్ల కుటుంబం 35 ఏళ్లు కష్టపడితే గానీ సంపాదించలేని మొత్తం. పైగా భూషణ్ సివిల్స్ చదువుల కోసం తల్లి తన బంగారు నగలను సైతం అమ్మింది. ఇక ఆ నగలను తిరిగి కొనివ్వాలనే బలమైన కోరిక ఉన్నప్పుడు, అత్యాశకు పోయి ఉన్న డబ్బును పోగొట్టుకోవడానికి భూషణ్ మనసు ఒప్పుకోలేదు.

పదేళ్ల ఓపిక.. ఏడాదిన్నర తపస్సు:

2016 నుంచి KBC కోసం ప్రయత్నిస్తున్న భూషణ్, ఎన్నోసార్లు విఫలమైనా పట్టు వదలలేదు. ఏదైనా సాధించాకే ఇంటికి వస్తానని చెప్పి గత ఏడాదిన్నరగా హాస్టల్‌లో ఉంటూ సివిల్స్‌కు సిద్ధమవుతున్నాడు. ఇలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తికి ఆ కోటి రూపాయలు కేవలం గెలుపు మాత్రమే కాదు, తన తల్లిదండ్రుల కష్టానికి దక్కిన గౌరవం. అందుకే ఆ క్షణంలో భావోద్వేగాలకు లోనుకాకుండా, అత్యంత పరిణతితో ఆలోచించి క్విట్ అయ్యాడు.

ఇక జీవితంలో ఏది కావాలి అనే దానికంటే, ఉన్నదాన్ని ఎలా కాపాడుకోవాలి అనే తెలివి చాలా ముఖ్యం. భూషణ్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం, అతనిలోని నిజమైన విజేతను ప్రపంచానికి పరిచయం చేసింది.

Tags:    
  • kbc18 
  • kaunbanegacrorepati 
  • bhushanthakare 
  • amitabhbachchan 
  • kbcwinner 

Similar News

ముల్లోకాల దేవతలూ దీవిస్తున్నారంటూ కంగనా ఆశీర్వాదం!

2026-11-26 09:07 GMT

సేతుపతి న‌ట‌నకు అవాక్క‌యిన హాలీవుడ్ లెజెండ‌రీ న‌టుడు!

2026-11-26 09:07 GMT

అమిత్‌ షాతో భేటీలో రావణుడు ఎక్కడ..?

2026-11-26 09:06 GMT

రేర్‌ ఫీట్‌... 115 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌

2026-11-26 09:05 GMT

క్రిస్మస్‌, సంక్రాంతికి సినిమాల సందడే సందడి

2026-11-26 09:02 GMT

ఎనిమిది గంటల షిఫ్ట్..బడా నిర్మాతలు దూరం!

2026-11-26 08:59 GMT

శర్వానంద్‌ 'భోగి' కి పోటీగా ఎవరు ఉన్నారు?

2026-11-26 08:58 GMT

మూడు వారాల్లోనే 'పుష్ప 2' రికార్డు బ్రేక్!

2026-11-26 08:58 GMT

నిషేధం వేళ పెళ్లిలో ఆతిఫ్ అస్లాంతో కలిసిన‌ హనీ సింగ్!

2026-11-26 08:56 GMT

సినిమా అయిపోయినా సీటు నుంచి లేవని పెద్దాయన.. కారణం తెలిస్తే నవ్వాల్సిందే!

2026-11-26 08:54 GMT

మూతపడే స్థితిలో ఉన్న ఇండస్ట్రీకి ఊపిరి పోసిన సినిమా!

2026-11-26 08:50 GMT

టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ మొదలైంది

2026-11-26 08:49 GMT

Copyright @2026

Powered by Blink CMS